బుడుగు : ఆడ పిల్లలు ఉన్న తల్లితండ్రులు ఇది మీరు మాత్రం తప్పక చదివాలి.. ఎందుకంటే..?

Suma Kallamadi
ప్రస్తుత కాలంలో ఆడపిల్లలకు రక్షణ కరువయింది. చిన్నపిల్లలు అని కూడా చూడడం లేదు. అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు. ఆడపిల్లను కనాలంటేనే భయపడిపోతున్నారు. ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి బయటకు వెళ్లాలంటే కూడా అందోళన చెందుతున్నారు. అందుకనే ఆడపిల్లలు గల తల్లితండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.. !! మన కుటుంబ సభ్యులు కానివారి నుంచి పిల్లలని దూరంగా పెట్టండి. అలాగే  పిల్లలని ఒంటరిగా ఆడుకోమనడం,పక్క ఇళ్ళకు పంపడం ఈకాలంలో  అంత మంచిది కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి  మనతో ఎంతో చనువుగా ఉన్న గాని బయట వాళ్ళు కూడా పిల్లలకి ప్రమాదకారులే కావచ్చు.అంతే కాకుండా  ఇతరులు మన పిల్లలని ఎత్తుకుని ముద్దులిడుతున్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

 చాక్లెట్ కొనిపెడతా షాపుకు తీసుకెళతా అంటూ మీ దగ్గర నుండి పిల్లలని తీసుకున్న వ్యక్తుల కోరికను సున్నితంగా తిరస్కరించండి. మా అమ్మాయికి చాక్లెట్ ఇష్టంలేదనో, తినదనో చెప్పండి. పరిచయం ఉన్న వ్వక్తులకు పిల్లలని అప్పగించి బయటకు తీసుకెళ్ళమని మీరే పురమాయించకండి. అత్యవసర పరిస్థితుల్లో పిల్లలని వేరే ఇంట్లో వదలిగానీ,  లేదా మీ ఇంట్లోనే వదలి వెళ్ళలసి వస్తే ఆ ప్రయత్నం మానుకొండి. అలాగే   పిల్లలు ఆడుకొనే చోటగాని,స్కూలుకు వెళ్ళే దారిలోగాని, స్కూల్లో జరిగే విషయాల్లో గాని ఆరా తీస్తూ ఉండండి. పిల్లలకు ఆటో గాని, వాన్ గాని ఎక్కించి స్కూల్ కు పంపేటప్పుడు డ్రైవర్ మీద నిఘా ఉంచడం మంచిది.  

కొంచెం ఎదిగిన పిల్లలకి దేహంలో ఎక్కడ ముట్టుకుంటే తప్పో,  అసభ్య  ప్రవర్తన ఏవిధంగా గుర్తించాలో వివరించండి. అలాంటి వ్వక్తులు నుంచి ఎలా తప్పించుకొవాలో, ధైర్యంగా ఎలా నిలబడలో,స్వయం రక్షణ ఎలా చేసుకోవాలి వివరించాలి. ఇంటి టెలిఫోన్ నెంబర్, పోలీస్ స్టేషన్ నెంబర్., పిల్లల వద్ద ఉంచి అత్యవసర సమయాల్లో ఇతరుల సహాయంతో ఫోన్ చేసేలా పిల్లలకు నేర్పండి.మరిన్ని జాగ్రత్తలు తదుపరి వ్యాసంలో చూద్దాం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: