బుడుగు : నవజాత శిశువు విషయంలో పాటించవలిసిన జాగ్రత్తలు ఇవే.. !!

Suma Kallamadi
అప్పుడే పుట్టిన శిశువు విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే పిల్లలు నోరు తెరిచి ఏమి చెప్పేలేరు కాబట్టి. అలాగే నవజాత శిశువు విషయలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.. !! నవ శిశువు రోజురోజుకీ బరువు పెంచుకుంటూ చక్కగా ఎదగాలి. పుట్టినప్పుటి నుంచి రెండేళ్ల వయస్సు దాకా శిశువు బరువును ప్రతినెలా గమనిస్తూ ఉండాలి.  వరుసగా రెండు నెలల పాటు శిశువు బరువులో పెరుగుదల లేకపోతే, ఏదో లోపం ఉన్నట్లు భావించి వైద్యుడిని సంప్రదించాలి.  ఆరునెలల వయస్సు వచ్చే వరకు శిశువుకు ఆహారమైనా పానీయమైనా కేవలం తల్లి రొమ్ము పాలు మాత్రమే అవసరమవుతాయి.

ఆరునెలల నిండాక, తల్లి పాలతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలు శిశువుకు అవసరం. ఆరునెలల నుంచి రెండేళ్ల వయస్సు వరకూ తల్లి పాలు కొనసాగిస్తూనే రోజుకు కనీసం ఐదుసార్లు శిశవుకు ఆహారం తినిపించాలి. అలాగే పిల్లలకు  అనారోగ్యాన్ని ప్రతి ఘటించటానికి, దృష్టి దోషాలను నివారించటానికి పిల్లలకు విటమిన్ - ఎ చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, నూనెలు, గుడ్లు పాల ఉత్పత్తులు, తల్లిపాలు, బలపరచిన ఆహార పదార్థాలు, విటమిన్ - ఎ సప్లిమెంట్లలో విటమిన్ - ఎ సమృద్ధిగా ఉంటుంది.పిల్లల శారీరక, మానసిక సామర్ధ్యాన్ని పరిరక్షించడానికి ఇనుము (ఐరన్) ధాతువు సమృద్ధిగా వున్న ఆహార పదార్థాలు అవసరం.  క్రమం తప్పకుండా బరువు పెరగటమనేది ఆ శిశువు ఎదుగుల, అభివ్రద్ధి చక్కగా ఉందని తెలిపే ముఖ్య సంకేతం. ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ప్రతిసారీ శిశువు బరువును తూచాలి.


మొదటి ఆరునెలల పాటు తల్లిపాలు మాత్రమే పూర్తిగా తాగిన శిశువు పెరుగుదల సాధారణంగా ఆ కాలంలో బాగుంటుంది. సాధారణంగా వచ్చే అనారోగ్యాలు తోడ్పడతాయి. వీరితో పోలిస్తే, తల్లిపాలు లేని శిశువు నేర్చుకోవటంలో నెమ్మదిగా ఉంటారు. అలాగే పిల్లలకు ఎప్పటికప్పుడు టీకాలు సమయానికి వేస్తూ ఉండాలి. అప్పుడే పుట్టిన బిడ్డకు బొడ్డుతాడు పచ్చిగా ఉంటుంది .బొడ్డు ఎండిపోయి దానంతట అది ఊడిపోయే వరకు జాగ్రత్తగా ఉండాలి.. పిల్లల విషయంలో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. పరిశుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.. ¡

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: