బుడుగు : పిల్లల బరువు తగ్గించడంలో ఇవి ముఖ్యపాత్ర వహిస్తాయి.. !!

Suma Kallamadi
ఇప్పటి కాలంలో అసలు ఎవరికీ కూడా  శరీరానికి సరిపడా వ్యాయామం ఉండడంలేదు. పెద్దవాళ్ళే కాదు బాల్యం లో ఉన్న చిన్న  పిల్లలు కూడా ఊబకాయం బారిన పడి పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. మారిన జీవన విధానం,  జంక్ ఫుట్స్ అధికంగా తీసుకోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా నూనెలో వేపిన పదార్ధాలు తినడం ఈ  సమస్యకు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ఈ సమస్యను  ఎలా అధిగమించడం అన్న అంశంపై ఓ నిపుణుల బృందం పరిశోధన చేసింది.  మాములుగా అందరికి ప్రొబయోటిక్ ఆహార పదార్థాల వల్ల కలిగే లాభాల గురించి  తెలిసిందే. వాటిలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టిరీయాలు పిల్లల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా జీర్ణ క్రియను మెరుగుపరిచి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి సహాయపడతాయి.అలాగే  శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అలర్జీలు రాకుండా రక్షణ ఇస్తుంది. అయితే ఈ పొషకాలు అనేవి ఎక్కడ లభిస్తాయో తెలుసా.. !!

మనకు  పచ్చడి, బటర్ మిల్క్, పెరుగు,.. వంటి పులియబెట్టిన ఆహార పదార్థాల లో ఎక్కువగా లభిస్తుంది. ఇక తాజాగా ఓ అధ్యయనం లో ప్రొబయోటిక్స్ వల్ల మరింత మేలు చేకూర్చే ప్రయోజనాలు ఉన్నట్టు రుజువైంది.బాల్యం, కౌమార దశలో ఊబకాయంతో బాధపడుతున్న వారి బరువు తగ్గించడంలో ప్రొబయోటిక్స్ శక్తివంతంగా పనిచేస్తాయని తేలింది. ఈ అధ్యయనం ఫలితాల ను యూరోపియన్ సొసైటీ ఆఫ్ ఎండోక్రినాలజీ-2020లో విడుదల చేసారు.

అలాగే పిల్లలో డయాబెటిస్, గుండె పోటు వంటి ఇతర ఆరోగ్య సమస్యల తీవ్రతను కూడా ప్రొబయోటిక్స్ తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. కావున పిల్లలకు ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉన్న ఆహారం పెట్టడం మంచిది.. !! అంతే కాకుండా పిల్లలు ఈ వయసులోనే ఎక్కువ బరువు పెరిగితే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: