బుడుగు : పిల్లలు తాగే పాల డబ్బాలో ఇంతా విషమా... !!

Suma Kallamadi
బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టకరం. అప్పుడే పుట్టిన పసి బిడ్డలకు తల్లి పాలను మించిన ఆహారం మరొకటి లేదనే చెప్పాలి. తల్లి పాలలో ఎన్నో రకాల  ఆరోగ్య ప్రయోజనాలు కలుగచేసే ప్రోటీన్లు, విటమిన్లు, ఇమ్మ్యూనోగ్లోబులిన్స్ ఉన్నాయి. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల  బిడ్డకు మాత్రమే కాదు తల్లికి కూడా మంచిది.  అయితే కొన్ని  కారణాలు వల్ల కొందరు తల్లులు బిడ్డలకు తమ పాలకు  బదులు.. డబ్బా పాలు పడుతున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు..
ఇలా చేయడం ద్వారా బిడ్డల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. అయితే కొన్నిపరిస్థితులలో  తల్లి ఆరోగ్య సమస్యల వల్ల బిడ్డకు పాలు ఇవ్వలేకపోవడం అనేది ఏమి చేయలేని విషయం.డబ్బా పాలు తాగించడం వలన పిల్లలు రోజుకు మిలయన్ల కొద్ది మైక్రోపాస్టిక్‌ను మింగేస్తున్నారని తాజా పరిశోధన లో తేలింది.


ఐర్లాండ్‌ఉన్న  ట్రినిటీ కాలేజ్ నిర్వహించిన ఈ అధ్యయనం నేచర్ ఫుడ్ జర్నల్‌లో ప్రచురించబడింది.  తల్లులు తెలిసి తెలియక చేసే తప్పులు వల్ల బిడ్డ ఆరోగ్యం దెబ్బ తింటుంది. తల్లులు బాగా వేడిగా ఉన్న పాలను డబ్బా ల్లో పోయడం, వేడి నీటితో  వాటిని శుభ్రపరచడం వల్ల మైక్రోప్లాస్టిక్‌లు విడుదలయ్యే అవకాశం ఉందని ఆ అధ్యయనం తెలిపింది. అందుకనే పిల్లలకు పాలు పట్టే  బాటిల్స్ శుభ్రపరిచేందకు వాడే నీటిని ప్లాస్టిక్ పాత్రలో కాకుండా ఇతర లోహాలతో చేసిన పాత్రలలో మాత్రమే వేడి చేయాలి. తరువాత నీటిని బాగా వేడిచేసిన తర్వాత గది ఉష్ణోగ్రతకు వచ్చే  వరకు చలార్చిన తర్వాత మాత్రమే బాటిల్స్‌ను శుభ్రం చేయాలి.

కనీసం మూడు సార్లు బాటిల్స్‌ను శుభ్రం చేయాలి . అలాగే బాటిల్స్ శుభ్రపరిచే సమయంలో ఎక్కువగా కుదపక పోవడం మంచిది.12 నెలల వయస్సు గల చిన్నారులపై  మైక్రో ప్లాస్టిక్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనే విషయాన్ని  పరిశోధకులు అంచనా వేశారు.. అందుకనే పిల్లలకు పట్టే పాల డబ్బాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.. పాలు కూడా వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో పోయకండి. కొంచెం చల్లారాక డబ్బాలో పోసి పట్టండి. వీలయినంత వరకు తల్లిపాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: