బుడుగు : పిల్లలకు పెట్టవలిసిన ఆహార పదార్ధాలు ఇవే.. !!

Suma Kallamadi
చాలామంది తల్లులు పిల్లల మీద చెప్పే కంప్లైంట్ ఒకటే.. మా పిల్లవాడు అసలు ఏమి తినడు.. మారం చేస్తాడు అని... ఇలాగే ప్రతి తల్లి వాళ్ళ పిల్లల గురించి చెప్తూ ఉంటుంది. అయితే కొంతమంది పిల్లలు పాలు త్రాగటానికి ఇష్టపడరు. అయితే పాలు త్రాగడం ఆరోగ్యకరమైన అలవాటే కానీ, కచ్చితంగా పాలు త్రాగాలని నియమం ఏమి లేదు. పాలల్లో ఉండే క్యాల్షియం తెల్ల నువ్వులలో కూడా అధికంగా ఉంటుంది. ఒకవేళ మి పిల్లవాడు పాలు తాగానని మారం చేస్తుంటే తెల్లనువ్వులు, బెల్లం కలిపి నువ్వులవుండలు చేసి పెట్టండి. అప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

అలాగే వేడిగా ఉండే పదార్ధాలనే కచ్చితంగా తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆకు కూరలను పిల్లలు తినడానికి ఇష్టపడరు. కానీ, వారానికి కనీసం మూడు సార్లు ఆకు కూరలు కచ్చితంగా తినాలి. ముఖ్యంగా తోటకూర చాలా చాలా మంచిది. ఈ అలవాటును ఇప్పుడు మనం మన పిల్లలకు నేర్పకపోతే భవిష్యత్తులో వాళ్ళ పూర్తిగా ఆకు కూరలను మర్చిపోయే ప్రమాదం ఉంది. పిల్లలకు  ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలచందలు మొదలైనవాటిని పెట్టడం చాలా చాలా మంచిది. కనీసం వారానికి రెండు రోజులైనా ఈ స్నాక్స్ వారి ఆహారంలో ఉండేట్లు చూచవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది.

 వారానికి  నాలుగు సార్లు  నువ్వుల ఉండ, వేరుశనగ ఉండ, సున్నుండ (బెల్లంతో చేసినవి) ఖచ్చితంగా పెట్టాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు కాలాన్ని బట్టి దొరికే అన్నిరకాల పండ్లను స్నాక్స్ పెట్టవచ్చు. వారానికి రెండు లేదా మూడుసార్లు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తావు లాంటివి కూడా ఖచ్చితంగా స్నాక్స్ గా పెట్టాలి.ప్యాకేజ్ ఫుడ్ అన్ని ఆపేయాలి. నూడిల్స్, కుంకురే, లేస్, బింగో, ప్యాకేళ్ల స్వీట్స్ మొదలైన అన్నిటికి పిల్లలను దూరంగా ఉంచాలి. వీటిలో ప్రిజర్వటీస్గా కలిపే రసాయనాలు చాలా హానికరం. నూనెలతో చేసే అన్ని పదాల ఉదాహరణకు పునుగులు, బజ్జీలు సమాసాలు మొదలైన వాటి పిల్లలను శాశ్వతంగా దూరంగా ఉంచండి, మసాలాలు, వేపుడు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచండి. మామూలుగా పిల్లల విషయంలో చెక్కర వాడకం విషయంలో జాగ్రత్త మన ఆహార పదార్ధాల తయారీలో చెక్కర వాడకాన్ని తగ్గించాలి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: