బుడుగు : చిన్నపిల్లల్లో నులిపురుగులు ఎందుకువస్తాయో తెలుసుకోండి.. !!

Suma Kallamadi
తల్లిదండ్రులకి వాళ్ళ  పిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ సంతోషంగా ఉండడం  కోసం ఎంతగానో తాపత్రయపడతారు. అలాగే  ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం కూడా తల్లిదండ్రులకు ఒక భాద్యత. పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, పిల్లలు చిరాకుగా లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు అంతే బాధ పడతారు. అందుకనే పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనతను  తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పాటునందించాలి. చిన్నపిల్లలకు నొప్పి లేదా అసౌకర్యంగా ఉన్నప్పుడు వెంటనే ఏడుస్తూ నవ్వటమే మానేస్తారు. నొప్పి, అసౌకర్యం రెండూ కూడా పెద్ద సమస్యలనే తెస్తాయి.అవి మనమే అర్ధం చేసుకోవాలి. అలాగే చాలామంది పిల్లలు ఎదుర్కునే ప్రధాన సమస్య కడుపులో నులిపురుగులు ఏర్పడడం.  కొన్ని సమయాల్లో ప్రేగుల్లో నులి పురుగులు కూడా పిల్లల్లో అసౌకర్యానికి కారణమవుతాయి. పసిపిల్లల్లో నులి పురుగులు ఉండటానికి అనేక కారణాలు ఉండవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మట్టిలో ఆడుకునే పిల్లలు ఎక్కువగా  నులిపురుగులు, కొంకిపురుగులు,ఎలికపాములు,టేప్ వార్మ్  బారిన తరచుగా పడి ఇన్ఫెక్షన్ కి గురవుతారు. ఇసుకలో చెప్పులు లేకుండా నడవడం, మురికి నీరుకి దగ్గర్లో ఉండటం, ఇన్ఫెక్షన్ ఉన్న ఆహారం తినడం, అపరిశుభ్ర పానీయాలు తాగడం వంటి వాటి వలన కూడా ఇవి సోకుతాయి. అలాగే సరిగ్గా ఉడకని ఆహారం లేదా శుభ్రంగా వండని ఆహారం తినటం వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. పిల్లల చుట్టూ పరిశుభ్ర వాతావరణం ఉంచకపోతే ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి.


కడుపులో నులి పురుగులు ఉంటే మీ బిడ్డకు విటమిన్లు, పోషకాలను అందకుండా చేస్తాయి. ఫలితంగా మీ పిల్లలకు పోషకలోపం కలుగుతుంది.పోషకలోపం ఉన్న పిల్లలు మామూలు పిల్లలకన్నా తక్కువ ఆరోగ్యంగా ఉంటారు. కడుపులో నులి పురుగులు ఉన్న పిల్లలకి రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.పిల్లల్లో కడుపులో నులి పురుగుల సాధారణ లక్షణాలు ఏంటంటే  పొట్ట నొప్పి, కొంచెం బరువు తగ్గటం, చిరాకు, ఆకలి లేకపోవటం, రక్తహీనత, దురద, ఆగని దగ్గు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి.అలాగే ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి డివార్మిటైజెషన్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: