బుడుగు : పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోండి.. !!

Suma Kallamadi
ఈ కాలంలో  ప్రతి తల్లితండ్రులకు  పిల్లల పెంపకం అనేది ఒక సవాల్ గా మారింది. పిల్లలను  పెంచే విషయంలో పిల్లలకు ఏదో నేర్పాలనే తాపత్రయం పెద్దలది.ప్రతి చిన్న విషయాన్ని అంటే  అవసరమున్నవి లేనివి అన్నీ వాళ్లకు చెప్పాలని ఎంతో తాపత్రయం పడతారు. ప్రతిదీ పిల్లలకు చెప్పాలనుకోవడంలో తప్పులేదు, కానీ పిల్లలకు అవసరమైన విషయాలను మాత్రమే చెప్పాలి. అనవసరమైన విషయాలు చెప్పి వాళ్ళ మైండ్ ను మార్చడం సరికాదు..పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి తల్లి తండ్రులలో అనేక మార్పులు వస్తాయి. మీ ఇంట్లోకి ఒక చిన్న బుజ్జాయి అల్లరి చేయడానికి రాబోతుందన్న వార్త మీకెంతో సంతోషాన్ని ఇస్తుంది కదా.. !!

బుజ్జాయి మీ జీవితంలోకి వచ్చాక  మీలో కొత్త ఆనందం వస్తుంది. హాయిగా నవ్వడం మొదలుపెడతారు. ఏవేవో పాటలు నోటి వెంట వస్తాయి. పిల్లలతో పాటు పాకుతారు... గెంతుతారు. మీ జీవితంలో అంత మార్పు తెచ్చిన ఆ పిల్లలను చూసి మీరు నేర్చుకోవాలేగాని వారికి పాఠాలు చెప్పరాదు.
కాబట్టి పిల్లలను జాగ్రత్తగా పెంచాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ జాగ్రత్త మరి అతి జాగ్రత కాకూడదు. పిల్లలకు కావాల్సిన ప్రేమ, ఆనందం అందిస్తూ వారికి మద్దతుగా నిలబడండి. మీ పెరటిలో నాటిన మొక్కను ఎలా పోషిస్తారో అలాగే మీ పిల్లలను చూడండి.

ఇంట్లో తగిన వాతావరణం కల్పించండి. వారికి కోపం అంటే ఏమిటో తెలియనీకండి. కష్టాలు కలుగనీయవద్దు. తిట్టడం, దండించడం చేయవద్దు. నిరాశ, నిస్పృహలను చూపకండి. మీ ఇంట్లో మీ పిల్లల మనసుల్లో ఆనందంను నింపండి.  ఇలా చేస్తే మీ పిల్లలు అద్భుతంగా పెరుగుతారు. మీ ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్తగా పెంచితే మంచి పిల్లలుగా పెరుగుతారు. తల్లితండ్రుల బాధ్యత వారి వెంట ఉండి సరైన మార్గంలో నడిపించడం కాదు, వారికి కావాల్సిన వాతావరణం సృష్టించడం మాత్రమే. మీరంటు సరిగ్గా లేనప్పుడు మీ పిల్లలు ఎలా సరిగ్గా పెరుగుతారు.. పిల్లలు ఉన్న ఇంట్లో బూతులు మాట్లాడుకోవడం, భార్య భర్తలు కొట్టు కోవడం, ఒకరంటే ఒకరికి ప్రేమ లేకుండా లెక్కలేని తనంగా ఉండడం, మద్యపానం చేయడం, దూమపానం ఇలాంటి వాతావరణం ఉంటే ఆ పిల్లాడి భవిష్యత్ అంధకారమే కదా... కాబట్టి చక్కటి, ప్రేమ ఆప్యాయతలతో కూడిన వాతావరణాన్ని పిల్లలకు అందించండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: