బుడుగు : మీ పిల్లలను తోటివారితో పోల్చుతున్నారా..??

Suma Kallamadi

ప్రతి తల్లితండ్రులు వాళ్ళ పిల్లలను ఎంతో  గొప్ప పొజిషన్ లో ఉంచాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే పక్క పిల్లవాడిని పోల్చుతూ ఉంటారు.నీ తోటి పిల్లవాడికి  అన్ని సబ్జెక్టుల్లో నీకంటే మంచి మార్కులే వచ్చాయి కానీ నీకు మాత్రం ఎప్పుడూ వాడికంటే తక్కువే అని ఎంతసేపు పిల్లలను తిడుతూ ఉంటాము. అయితే  పిల్లల మధ్య పోటీతత్వం పెంచడం మంచిదే గానీ పదేపదే పిల్లల్ని తోటి వారితో పోల్చితే వారు మానసికంగా ఒత్తిడికి గురవుతారు.అందుకే ఇలాంటి ప్రతి సందర్భంలోనూ పిల్లలకు ప్రేమగా, ఓపికగా ఆ విషయం గురించి క్లుప్తంగా చెప్పాలి. అప్పుడే ఆ మార్పు తమ మంచికేననే సంగతి ఆ చిన్నారుల మనసులో దృఢ పడుతుంది.

ఉదయం నుంచి పడుకోబోయే వరకూ పిల్లని ప్రతి విషయంలో తోటి వారితో పోల్చితే, వారిలో ప్రతికూలమైన ఆలోచనా విధానం ఏర్పడి, ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా ఆలోచించటం, పని చేయటం చేస్తారు. కొత్త వారితో చొరవగా కలవలేకపోవటం, ఒంటరిగా ఉండటానికి అలవాటు పడతారు.అలాగే కొంతమంది ఇళ్లల్లో  తోబుట్టువులతో పోల్చడం వల్ల పిల్లల్లో ఆత్మనూన్యతా భావం పెరిగి కోలుకోలేనంత నిరాశలో కూరుకు పోతారు.అక్క చూడు నీకన్నా ముందే రాసేసింది.


నీకు ఏది చేతకాదు అని పిల్లల్ని పక్కన వాళ్ళతో పోల్చకూడదు..  ఇది మొండితనానికీ , తప్పించుకు తిరిగే ధోరణికీ దారితీసే ప్రమాదం వుంది.దీని వల్ల పిల్లలు భయపడి ఇల్లు విడిచి పోవటం,వాళ్ళని వాళ్లే గాయపరచుకోవటం వంటి పనులు చేసుకునే ప్రమాదం ఉంది.ఆహారం తీసుకోవటం, ఆటలు ఆడటం వంటి విషయాల్లో తోటి వారితో పోల్చినప్పుడు పిల్లలు ఆనందంగా ఆయా అంశాల్లో పోటీ పడతారు.పిల్లలు పరస్పరం పోట్లాడుకుంటే మీరు ఒకరి పక్షం వహించొద్దు. ఇలా చేస్తే రెండో పిల్లాడికి మీ మీద, తోబుట్టువు మీద ద్వేషం కలుగుతుంది. ఇద్దరు పిల్లలున్నప్పుడు కూడా ఒకరిని తిట్టడం మరొకరిని పొగడటం లాంటివి చేయకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: