బుడుగు : పిల్లల మానసిక స్థితిపై తల్లితండ్రులు నిఘా ఉంచండి.. !!

Suma Kallamadi
ఈ రోజుల్లో పిల్లలపై మానసిక ఒత్తిడి అనేది పెరిగిపోతుంది.ఇలా పిల్లలపై ఒత్తిడి అనేది పెరగడం వల్ల పిల్లలు భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో వారిని అర్థం చేసుకుని వారికి అండగా ఉండటం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. పిల్లల చదువుతో పాటు వారి జీవితం, మానసిక పరిస్థితి గురించి కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే కింద చెప్పబడే  విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక టైమ్ టేబుల్ అనేది సెట్ చేసి ఉంచండి. ప్రతి రోజు ఎప్పుడు లేవాలి.. ఎప్పుడు పడుకోవాలి.. ఎప్పుడు ఆడుకోవాలి అనేది అందులో వివరించాలి. దాంతో కొన్ని నెలల తరువాత వాళ్లు పాఠశాలకు వెళ్లినా వారికి పెద్ద భారంగా అనిపించదు. అలా అని మరి కఠినంగా కూడా ఉండకండి. ఆదివారం  లేక సెలవు రోజుల్లోనో  కొంచెం ఎక్కువ సేపు పడుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి.

అలాగే కొంతమంది పిల్లలు అస్తమానం ఇంట్లోనే ఉంటారు.ఎవ్వరితోను త్వరగా కలుపుకోలుగా మాట్లాడలేరు. అందుకనే తల్లితండ్రులు కనీసం ఎప్పుడో ఒకసారి అయిన బయటకి తీసుకుని వెళుతూ ఉండాలి. అప్పుడప్పుడు బందువుల ఇళ్ళకి కూడా తీసుకు వెళితే భయం పోతుంది.  దాంతో పాటు తరచూ పిల్లలు వాళ్ల స్నేహితులతో, టీచర్స్ తో మాట్లాడేలా చూడండి. దాంతో వారిలో ఒత్తిడి తగ్గుతుంది.పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని మీకు నచ్చిన పనులు చేయమని.. లేదా మీరు చెప్పిన విధంగా ఉండాలి అని కట్టడి చేయకండి. వారికి స్వేచ్ఛ ఇవ్వండి. వారికి నచ్చిన పని ఎలా చేయాలో  సలహా ఇవ్వండి అంతే. వీలయితే ఆ పనిలో  మీరు సహాయం అందించండి. వారి ఇమోషనల్ హెల్త్ ( Emotional health ) విషయంలో జాగ్రత్తగా ఉండండి.


పిల్లల టీచర్లతో రెగ్యులర్ గా మాట్లాడండి. వారిని అడిగి పిల్లల కోసం షెడ్యూల్ సిద్ధం చేయండి.మీ పిల్లలు కాలేజీకి వెళ్లే వయసులో ఉంటే వారితో స్నేహంగా మెలగండి. అనవసరంగా ఎదిగిన పిల్లలకు క్లాస్ పీకకండి.అలాగే అస్తమానం చదువు ఒక్కటే ప్రపంచంలాగా పిల్లలను పెంచకండి.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పుస్తకాలు తీసి చదువు అనే ధోరణి మానేయండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: