బుడుగు : మీ పిల్లలు వీడియో గేమ్స్ కి అలవాటు పడ్డారా..? అయితే ఇలా చేయండి.. !!

Suma Kallamadi
ఈ కాలంలో చాలామంది పిల్లలు చదువు మీద కన్నా ఎక్కువగా  అన్లైన్‌లో గేమ్స్ ఆడేందుకు బోలెడంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు .తల్లితండ్రులు ఎంత చెప్పిన గాని పిల్లలు మాట వినడం లేదు కదా తిరిగి బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఆడుకోనివ్వకపోతే సూసైడ్ చేసుకుంటాం అని, ఇల్లు వదిలి పారిపోతాం అని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో ఎలా ఈ సమస్యలో నుంచి తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్ధం తెలియక తల్లి తండ్రులు తికమక పడుతున్నారు.మీ పిల్లల్ని వీడియో గేమ్స్ నుంచి బయటపడేసే కొన్ని చిట్కాలు మీకోసం..

ముందుగా ఈ విషయంలో తల్లితండ్రులు చేసే చిన్న పొరపాట్లే పిల్లలు వీడియో గేమ్స్ ఆడేలా చేస్తాయి. పిల్లలు అడిగారనో, లేక వాళ్ళ అల్లరి తట్టుకోలేక లేక మరేదో కారణం చేత పిల్లలకు మొదట్లో వీడియో గేమ్స్ అలవాటు చేస్తారు. వాళ్ళు ఏమో అలవాటు పడిపోతారు. అలా సడెన్ గా ఒక్కసారిగా ఆడవద్దు అంటే వాళ్ళ పసి మనస్సు నొచ్చుకుంటుంది. వీడియో గేమ్స్ లాంటి క్విక్ ఎంటర్టెయిన్మెంట్ మీద టైమ్ స్పెండ్ చేసే పిల్లలు ఆ తర్వాత దేని మీద శ్రద్ధ పెట్టలేనివారుగా తయారవుతారు. మనం చెప్పేది వాళ్ళు త్వరగా అర్ధం చేసుకోలేరు కూడా. పైగా దీని వల్ల యాంగ్జైటీ, నలుగురిలో కలవలేకపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తూ ఉండడం మంచిది కాదు. అందుకనే తల్లి తండ్రులు కొంత సమయాన్ని పిల్లలతో గడపడానికి వెచ్చించండి. మీ అబ్బాయిని రకరకాల ఇన్‌డోర్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేయండి. బోర్డ్ గేమ్స్ ఆడడం, మ్యూజిక్ వినడం, వంటలో సాయం చేయడం…ఏదైనా సరే. దీని వల్ల మీకూ, మీ అబ్బాయికీ మధ్య రిలేషన్  పెరుగుతుంది.


అతను రోజుకి ఎంత సమయం గేమ్స్ ఆడుకోవచ్చో ఒక టైమ్ చెప్పండి. ఇది మరీ ఎక్కువగా, లేదా మరి తక్కువగా ఉండకుండా చూసుకోండి. వీకెండ్స్‌లో ఇంకొంచెం ఎక్కువ సమయం ఇవ్వండి. మీరు చెప్పిన టైమ్‌ని ఫాలో అవుతున్నాడో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి.
ఇంటి పనుల్లో సాయం చేసినప్పుడల్లా అతనికి నచ్చిన పని ఒకటి చేయండి. వీలున్నంత వరకూ ఇవి డబ్బుతో ముడిపడి ఉండకుండా చూసుకోండి. అతనికి ఇష్టమైన కూర చేసిపెట్టడమో, అతనితో కలిసి అతని బట్టల బీరువా సర్ది పెట్టడమో.. ఇలాంటివి ట్రై చేయండి.
మీ అబ్బాయికి ఇంతవరకూ రీడింగ్ హాబిట్ లేకపోతే అలవాటు చేయండి.అతని ఫ్రెండ్స్‌తో, కజిన్స్‌తో కబుర్లు చెప్పుకోడానికి ఎంకరేజ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: