బుడుగు : మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇలా మాత్రం తప్పక చేయండి.. !!

Suma Kallamadi
పిల్లలను పెంచడం చాలా ఓపికతో కూడిన పని. వాళ్ళు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.వాళ్ళకి ఏమి తెలుసు ఏది, మంచో చెడో అన్నా విషయం. నచ్చింది చేస్తారు. చిన్నపిల్లల విషయం అయితే ఇంకా చెప్పక్కర్లేదు.ఏ వస్తువు కనిపించిన సరే వాళ్ల కళ్ళకు ఆడుకునే బొమ్మలాగా అనుకుంటారు. ఆ వస్తువు వల్ల వాళ్లకు అపాయం జరుగుతుందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. అందికనే ఇంట్లో పసి పిల్లలు ఉన్నపుడు ఏ వస్తువులు అయిన వాళ్లకు అందకుండా పెట్టాలి. అలాగే పిల్లల మందులు, డిటర్జెంట్స్ కూడా వాళ్లకు అందనంత ఎత్తులో పెడితే మంచిది. అంతేకాకుండా మీకు ఎంత వీలైతే అంత పసిపిల్లలతో ఆటలు ఆడండి, హత్తుకోని ఉండండి, మాట్లాడండి, నవ్వండి ఇంకా వారికి పాటలు పాడి విన్పించండి.


పిల్లలు సులభంగా కోపం తెచ్చుకుంటారు,భయపడతారు, ఏడుస్తారు ఇంకా వారికి ఏం అన్పిస్తుందో కూడా చెప్పలేరు. అందుకని చిరాకు తెచ్చుకోకండి. ఎప్పుడూ ప్రేమగా ఉండండి.పసిపిల్లలు ఏది అయినగాని  వేగంగా నేర్చుకుంటారు.ఉదాహరణకు ఎలా నడవాలి, శబ్దాలు చేయటం, తినడం,తాగడం లాంటివి.  అమ్మాయిలు,అబ్బాయిలు అందరూ ముఖ్యమే. అందర్నీ ఒకేలాగా, ముఖ్యంగా జబ్బు చేసిన పిల్లలను, వికలాంగులైన పిల్లలను ఒకేలాగా చక్కగా చూడండి.పిల్లలు తమ చుట్టూ ఉన్నవారిని అన్నిటిలో అనుకరిస్తారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి, వారి దగ్గర సరిగ్గా ప్రవర్తించి, వారికి మంచిమార్గాలు చూపించండి.పసిపిల్లలు ఏడ్చినప్పుడు తప్పక ఏదో ఒక కారణం ఉంటుంది (ఆకలి,భయం, నొప్పి).
అది ఎందుకో కనుక్కోండి.

.అంతేకాని వాళ్ళు అలాగే ఏడుస్తారు అనే నిర్లక్ష ధోరణి పనికిరాదు.పసిపిల్లలను అంకెలు, పదాల ఆటలు, పెయింటింగ్, బొమ్మలు వేయించటంలాంటివి ఆడించి వారిని బడికి సిద్ధం చేయండి. వారికి కథలు చెప్పండి, పాటలు పాడండి, డ్యాన్స్ చేయండి. ఒక నోటు పుస్తకంలో పాపాయి, పిల్లలుగా ఎలా ఎదుగుతున్నారో చూస్తూ అందులో రికార్డు చేయండి. వారు చేసిన ‘మొదటి’పనులు మాట్లాడటం, నడవటం వంటివి.పిల్లలు శుభ్రంగా ఉండేలా చేయండి(ముఖ్యంగా చేతులు,మొహాలు),సురక్షితమైన నీళ్ళు తాగేలా, సరిపోయేంత మంచి ఆహారం తినేలా చేసి వ్యాధులు రాకుండా అరికట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: