రాముడు నిజంగా ఉన్నాడా? రామాసేతుని రాముడే కట్టించాడా? తెల్చేసిన ఇస్రో, నాసా?

Purushottham Vinay

భారత్‌ - శ్రీలంక మధ్య రామేసేతు వంతెన కాల్పనికం కాదని అది నిజంగానే ఉందని ఇస్రో నిర్దారించింది. ఈమేరకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం సహాయంతో తమిళనాడు వంతెనకు సంబంధించిన మ్యాప్‌ ని విడుదల చేశారు.ఈ వంతెన పొడవు మొత్తం 29 కిలోఈటర్లు ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి మొత్తం 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోటి నుంచి శ్రీలంక దాకా ఉందని తెలిపారు. దీప్వపంలోని తలైమన్నార్‌ వాయవ్య దిశ దాకా విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఇక దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ఇంకా ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు ప్రనకటించారు.దీన్ని స్వయంగా రాముడే నిర్మించాడని కొందరు చెబుతుంటే … కాదు ఈ వంతెన సముద్రంలో సహజసిద్ధంగానే ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు. అయితే భారత్‌లో ఈ వంతెనను రామసేతు అని పిలుస్తుండగా, శ్రీలంకలో మాత్రం అడాంగ పాలం అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో ఆడమ్స్‌ బ్రిడ్జ్‌ అని కూడా అంటారు. దీని ఆధారంగానే గతంలో రామసేతు అనే సినిమాని కూడా తెరకెక్కించారు.


ఈ రామసేతు వయసు 17 లక్షల ఏళ్లు ఉంటుందని,  రావణుడు సీతను అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి రాళ్లతో ఈ వంతెనను నిర్మించాడనేది చాలామంది భారతీయులు చెప్పుకుంటున్న స్టోరీ. సుమారు 30 మైళ్ల పొడవైన ఈ వంతెన ఎలా నిర్మితమైంది అన్నది మాత్రం ఇప్పుటికీ శాస్త్రవేత్తలకి అంతుచిక్కని ప్రశ్నే.అయితే దీనిపై తాజాగా ఇస్రో శాస్త్రవేత్తలు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా నిర్మించినదే అని తేల్చారు. సహజ సిద్ధంగా ఏర్పడలేదని ప్రకటించారు.ఇక ఈ రామసేతు నిర్మాణంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా పరిశోధనలు చేసింది. శాటిలైట్ల ద్వారా తీసిన ఛాయాచిత్రాల్లో 30 మైళ్ల పొడవున రాళ్లు పేర్చి ఉన్నట్లుగా ఇది కనిపిస్తుందని ప్రకటించింది. అయితే ఇది మానవ నిర్మితం అని మాత్రం నాసా ఎప్పుడూ ధ్రువీకరించలేదు. కానీ 2017 డిసెంబర్‌ నెలలో అమెరికాకు చెందిన సైన్స్‌ ఛానెల్‌… 30 మైళ్లకు పైగా పొడవున్న రామసేతు మానవ నిర్మితమని ప్రకటించడం ద్వారా మరోసారి చర్చకు తెరలేపింది. ఇక రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడినట్లు లేదని, అక్కడి ఇసుక సహజంగా ఉన్నదే అయినా దానిపై పేర్చిన రాళ్లు మాత్రం వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయని పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్‌ అలెన్‌ లెస్టర్‌ తెలపడం జరిగింది. ఈ ఇసుక 4వేల ఏళ్ల నాటిదని, రాళ్లు 7 వేల ఏళ్ల నాటివని ఆ పరిశోధన లో తేలిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: