మార్చి 22: నేటి ప్రాముఖ్యత ఏంటంటే?

Purushottham Vinay
నేడు ప్రపంచ నీటి దినోత్సవం. ఇది ఐక్య రాజ్య సమితి జరిపే వార్షిక దినోత్సవం. ఈరోజున ప్రతి ఏటా మార్చి 22 న జరుపుతారు. ఈరోజు మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు. 1992 బ్రెజిల్ లోని రియో డి జనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం (UNCED) ఎజెండా 21లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. తొలి ప్రపంచ నీటి దినోత్సవం 1993లో జరిగింది.ఈ రోజు ఇతివృత్తంగా పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత లకు సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తుంది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్‌లోని ఆరవ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఐరాస ప్రపంచ నీటి అభివృద్ధి నివేదిక (WWDR) విడుదల అవుతుంది.ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలతో జరుపుకుంటారు. ఇవి నాటకం గాని, మ్యూజికల్, లేదా ప్రకృతిలో లాబీయింగ్ గానీ కావచ్చు. 


ఈ రోజున నీటి ప్రాజెక్టుల కోసం డబ్బును సేకరించే ప్రచారాలను కూడా చేపడతారు.అందుకే మార్చి 22న ప్రపంచమంతా ప్రపంచ నీటి దినోత్సవం దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నీటిని వృధా చెయ్యకుండా కలుషితం కాకుండా సంరక్షించడం ఇంకా నీటి ప్రాముఖ్యత గురించి సమాజములో అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1993 లో ఈ రోజుని ప్రకటించింది. 1992 సంవత్సరంలో రియో డి జనీరోలో జరిగిన " యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ " షెడ్యూల్ 21 లో మొదటిసారిగా దీనిని అధికారికంగా ప్రతిపాదన చేయడం జరిగింది.సామాజిక ఆర్థిక వృద్ధి ఎక్కువగా నీటిపైనే ఆధారపడి ఉంటుంది. త్రాగునీరు మానవ ఆరోగ్యానికి, శ్రేయస్సుకు చాలా అవసరం, పోషకాహారం, గాలి, మానవ జాతికి ప్రాథమిక జీవనోపాధిని అందిస్తుంది, ఇవి లేకుండా మనిషి జీవించడం అసాధ్యం. మంచినీటి విషయానికి వస్తే, భూమి మొత్తం వైశాల్యంలో కొద్ది భాగం మాత్రమే మానవ ఉపయోగానికి అనుకూలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: