చరిత్రపుటలు: ఆరోజు బ్రిటీష్‌ జెండాను కిందకు దించలేదా?

Chakravarthi Kalyan
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు చాలా సినిమాల్లో, వీడియోల్లో బ్రిటిష్ జెండా కిందకి దిగుతూ ఉంటే, భారతీయ జెండా పైకి ఎగురుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. అది చూసి మనం గొప్పగా భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి బ్రిటిష్ జెండా అప్పుడు కిందకి దిగడం అనేది జరగలేదట. ఈ విషయం చెప్పింది కూడా మరి ఎవరో కాదు ఆనాటి వైస్రాయ్ జనరల్ మౌంట్ బాటన్. తాజాగా స్వాతంత్రం వచ్చే రోజుల్లో ఏం జరిగింది అనేది బీబీసీ తన వార్తల్లో వెల్లడించినట్లుగా తెలుస్తుంది.


స్వాతంత్రం  రావడానికి ఒక్క రోజు ముందు పది లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, కోటి 20 లక్షల మంది శరణార్థులయ్యారనే విషయం బీబీసీ ఇప్పుడు ప్రత్యేకించి చెప్తుంది. పది లక్షల మంది  భారతీయుల ప్రాణాలు అప్పుడు కోల్పోగా నదుల్లో శవాలు కొట్టుకొచ్చినట్లుగా చెప్తుంది అది. మౌంట్ బాటన్ స్వాతంత్రం వచ్చిన రోజున బ్రిటిష్ జెండాను కిందకి దింపితే బ్రిటిష్ వాళ్ళు బాధపడతారని చెప్పడంతో నెహ్రూ మేనేజ్ చేసుకొచ్చారట.


బ్రిటిష్ వాళ్ళ జెండాను కిందకి దింపడం అనే విషయాన్ని పక్కన పెట్టి భారతీయుల జెండాను మాత్రమే ఎగరేసే విధంగా ప్లాన్ చేశారట ఆయన. అంతే కాకుండా సంవత్సరంలో ముఖ్యమైన 12 రోజులు బ్రిటిష్ వారి జెండాను ఎగర వేయాలని కూడా ఆ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారట. మౌంట్ బాటన్ అలాగే భారత దేశపు క్రౌన్ ప్రతినిధి ఆగస్టు 16 1947నాటి టాప్ సీక్రెట్ అండ్ పర్సనల్ రిపోర్ట్ నెంబర్17 లో ఈ బహిర్గతమవ్వని నిజం ప్రచురితమైందని తెలుస్తుంది.


లండన్ లోని ఇండియన్ ఆఫీసులో దీనికి సంబంధించిన వీడియో అందుబాటులో ఉందని  అంటున్నారు. స్వాతంత్రం కోసం ఝాన్సీ లక్ష్మీబాయి  కుది రాం బోస్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి ఎందరో వీరులు తమ ప్రాణ త్యాగం చేశారు. కానీ ఇలాంటి నాయకులు ఉంటారు అనుకుంటే ఏమి చేసేవారో అని అనుకుంటున్నారు కొంత మంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: