షాకింగ్‌: ఆ దేశంలోని తవ్వకాల్లో వెలుగులోకి త్రిశూలం?

Chakravarthi Kalyan
హిందూ సంస్కృతి కేవలం మన దేశంలోనూ ఇంకా పొరుగు దేశాల్లో మాత్రమే ఉంటుందని ఒక రకంగా ఒక అపోహ ఉండేది మొన్నటి వరకు. ఇప్పటివరకు బాలి, మలేషియా, చైనా, జపాన్ వంటి దేశాల్లో హిందూ దేవుళ్లను కొలవడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మన దేశంలోనూ, ఇంకా ఈ దేశాలలో మాత్రమే హిందూ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయని అనుకుంటారు సహజంగా.

మన దేశం లోనూ, మన పొరుగు దేశాల్లో మాత్రమే కాకుండా మనకు దూరంగా ఉండే దేశాలలో కూడా ఇప్పుడు హిందూ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడుతున్నాయని తెలుస్తుంది. ఇది ఒక విచిత్ర పరిణామం. పది వేల ఏళ్ల నాటి త్రిశూలం, మూడు వేల ఏళ్ల నాటి వజ్రాయుధం తాజాగా తవ్వకాల్లో బయటపడ్డాయని తెలుస్తుంది. ఇవి 2015లో ఫిలిప్పీన్స్ లో లభ్యమయ్యాయి అని తెలుస్తుంది.

వీటిని కర్ణాటకకు చెందిన సయ్యద్ సామ్యూల్ హుస్సేన్ బెంగళూరు ప్రెస్ క్లబ్ లో ప్రదర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 2012 నుంచి ఫిలిప్పీన్స్ కాపర్ గోల్డ్ మైనింగ్ తవ్వకాల్లో తాను భాగస్వామినని చెప్పారు. 2015 మే నెలలో ఫిలిప్పీన్స్ మైనింగ్ తవ్వకాల్లో ఈ త్రిశూలం, వజ్రాయుధం బయటపడ్డాయని ఆయన తెలిపారు. 2017 మే 4న మైనింగ్ సూపర్వైజర్ వచ్చి తాము మునుపెన్నడు చూడనటువంటి వస్తువులు బయటపడ్డాయని తెలిపారని చెప్పారు.

అయితే వాటిని నీటితో కడిగి చూడగా ఒకటి దేవుని విగ్రహంలా కనిపించిందని, మరొక వస్తువు త్రిశూలంలా గుర్తించామని ఆయన చెప్పారు. వాటిని ఇంటికి తీసుకెళ్ళి వాటి ఫోటోలను మిత్రులందరికీ షేర్ చేశామని ఆయన చెప్పారు. అయితే వాటి వివరాలను సేకరించడం కోసం ఇంటర్నెట్ అంతా సెర్చ్ చేశారట. అయితే శివుని త్రిశూలంతో పాటు ఉన్న ఆ వస్తువు వజ్రాయుధంగా గుర్తించామని ఆయన తెలిపారట. ఇది పురాణాల్లో ఇంద్రుని ఆయుధంగా చెప్పబడిందిని చెప్పారు. పురాతత్వ శాఖ వాళ్ళు ఈ వస్తువులను పురాతన వస్తువులుగా ఆమోదించారని ఆయన  తెలపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: