ఆ రాజు చివరి రొజులు

D.V.Aravind Chowdary
చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న  అత్యంత శక్తివంతమైన పాలకుల్లో ఒకరిగా ఈనాటికీ కీర్తింపబడుతున్న ఫ్రాన్స్ పాలకుడు  నెపోలియన్.1804 లో ఫ్రాన్స్ పాలకుడిగా భాద్యతలు స్వీకరించి 1814 వరకు ఏకఛత్రాధిపతిగా , పలు యుద్దాలలో జైత్రయాత్ర సాగిస్తూ  వెలుగు  వెలిగిన నెపోలియన్  తరువాత కాలం మొత్తం గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి  లీపజయింగ్ యుద్ధంలో  మొదటిసారిగా కూటమి దేశాల చేతిలో ఓటమి పాలై  వారితో సంధి చేసుకొన్నాడు , సంధిలో భాగంగా  రాజ్యాన్ని వదలి ఎలబా ద్వీపానికి పంపబడ్డాడు.    

ఎలాబా ద్వీపంలో 8 నెలలు గడిపిన తరువాత అక్కడి నుంచి తప్పించుకొని తిరిగి ప్రాన్స్ చేరుకున్నాడు. ప్రాన్స్ చేరుకున్న తరువాత చేసిన తిరిగి రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని కూటమి దేశాల మీద యుద్దం ప్రకటించాడు. వాటర్ లూ (ప్రస్తుతం బెల్జియం దేశంలో భాగంగా ఉంది ) ప్రాంతంలో కూటమి దేశాలతో తలబడి 1815 జులై 15 న వాటర్ లూ యుద్దంలో రెండోసారి  కూటమి దేశాల చేతిలో  ఫ్రాన్స్  ఓటమి చెందడంతో వారికి లొంగిపోయిన నెపోలియన్ ను యుద్ధ ఖైదీగా ఆఫ్రికా పశ్చిమ కోస్తా  తీరానికి సుమారు 1200 మైళ్ళ దూరంలోని దక్షిణ అట్లాంటిక్ లో ఉన్న సెయింట్ హెలెనా అనే మారుమూల ద్వీపానికి తరలించబడ్డాడు. 

నెపోలియన్ మరోసారి  తప్పించుకోకుండా ఉండే విధంగా కూటమి దేశాలకు నాయకత్వం వహించిన ఇంగ్లండ్ పక్కా  ప్రణాళికాతో  తొలుత  ఈశాన్య ఇంగ్లాండ్ లోని ఒక ద్వీపం లో ఉంచి అక్కడి నుండి రాత్రి సమయంలో సెయింట్ హెలెనా కు తరలించారు. పదిన్నర మైళ్ళ పొడవు , ఆరున్నర మైళ్ళ  వెడల్పు ఉండే ఈ అతి చిన్న దీవిలోనే  మరణించే వరకు అంటే సుమారు 6 సంవత్సరాలు గడిపాడు. ఆ దీవిలో ఉన్న పరిస్థితులు గురించి తరచూ ఆ దీవి పాలకుడైన హడ్సన్ లోవ్ తో తరచూ గోడవపడే వాడు . క్షమా గుణం కలిగిన హడ్సన్ తో వాదులాట దీవి నుంచి పారిపోయే  అవకాశాలు  శాశ్వతంగా లేకుండా పోయాయి.
 

హడ్సన్ తో వైరం కారణంగా పారిపోయే ఉద్దేశం ఉందని సందేహంతో తనకు కాపలా మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. అయినా సరే నెపోలియన్ తన ప్రయత్నాలను  విరమించకుండా సాగిస్తూనే ఉన్నాడు. ఇదే సమయంలో దీవిలో తను అనుభవిస్తున్న మనోవేధనను , ఎదుర్కున్న పరిస్థితులను , అనుభవాలను అక్షరరూపం ఇస్తూ వచ్చాడు. 

దీవిలో వచ్చిన తరువాత నుంచి నెపోలియన్ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ వచ్చింది , మరణించే నాటికి ఆయన శరీరం చిక్కి శూల్య మయ్యింది. అలా అనారోగ్యంతో బాధపడుతూనే  1821 మే 5 న మరణించారు. కానీ కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం దీవిలో ఉన్న సమయంలో నెపోలియన్ ఏటువంటి అనారోగ్యానికి గురి కాలేదని కేవలం విష ప్రయోగం వల్లనే మరణించాడని అంటుండగా , మరికొందరు మాత్రం రాజుగా ఉన్న సమయంలోనే ఆయన ఉదర సంబంధిత వ్యాధులకు తరచూ గురయ్యేవాడని వైద్యుల ఇచ్చే మందులు తినేవాడని , కానీ దీవి లోకి వెళ్ళిన తరువాత సరైన వైద్యం అందక ఉదర సంబంధిత క్యాన్సర్ తో మరణించాడు అంటున్నారు. ఇప్పటికీ అతని మరణం ఒక రహస్యంగా చరిత్రలో మిగిలిపోయింది. 

ప్రపంచాన్నే ఒకప్పుడూ శాసించి , ఎందరో పాలకులకు పాలనలో ఆదర్శంగా నిలిచిన  నెపోలియన్ ఆఖరి రోజుల్లో కుటుంబానికి దూరమయ్యి  దిక్కు మొక్కు లేని  అనాథగా మరణించడం వీధి లిఖితం .  

    

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: