హైదరాబాద్ లో చూడాల్సిన బెస్ట్ ప్లేసేస్ ఇవే..!!

Divya
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న కొన్ని కట్టడాలను పర్యాటక ప్రాంతాలుగా మార్చడానికి.. ప్రస్తుతం ఉన్న పురాతన కట్టడాలకు కొత్త రంగులను అద్ది.. పర్యాటకులను ఆకర్షిస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఎవరైనా సరే హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు ఏం చూడాలి..? ఎక్కడ చూడాలి..? అని ఆలోచనలో ఉంటారు. అయితే మీరు కనుక ఈసారి హైదరాబాదులో ఉన్న పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటే అతి ముఖ్యమైన ప్రాంతాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
చార్మినార్:
హైదరాబాద్ అనగానే చాలు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్ చార్మినార్. క్రీస్తు శకం 1591 లో కులీ కుతుబ్ షా,  అప్పట్లో హైదరాబాదులో అనగా భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి నివారించిన దైవశక్తికి కృతజ్ఞత తో భావించి, చార్మినార్ ను నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.. కాబట్టి మీరు కనుక ఈ సారి హైదరాబాద్ వెళ్తే ఫస్ట్ చార్మినార్ ను సందర్శించండి.
గోల్కొండ కోట:
హైదరాబాద్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో గోల్కొండ కోట మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్న విశిష్టత ఏమిటంటే, ఈ కోటలో మనం కనుక చప్పట్లు కొడితే ఆ శబ్దం ఏకంగా 91 మీటర్ల ఎత్తున ఉన్న రాణీమహల్ వద్దకు బాగా వినిపిస్తుంది అట.. అంటే శత్రువుల నుంచి కోటను రక్షించుకోవడానికి ఇలా నిర్మించారని చరిత్ర చెబుతోంది.
హుస్సేన్ సాగర్:
హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుని విగ్రహం చేరుకోవడానికి మనం పడవల ద్వారా వెళ్లవచ్చు.. ఇక ఈ చెరువు చుట్టూ మన నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్ వంటివి చూడవచ్చు.
బిర్లా మందిర్:
ఈ మందిరాన్ని తెల్లని పాలరాతితో నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువుదీరాడు ..ఇక అంతే కాదు ఈ బిర్లా మందిర్ కి దగ్గర్లో పబ్లిక్ గార్డెన్ , అసెంబ్లీ హాల్ కూడా ఉన్నాయి.

యాదాద్రి గుట్ట:
మహా నగరానికి అతి తక్కువ దూరంలో ఉన్న యాదాద్రి గుట్ట ప్రస్తుతం భారత దేశంలోనే అత్యున్నత దేవస్థానం గా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఈ మహా క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు సందర్శించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: