తెలంగాణలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ..ఎలా ఉందో చూడండి..?

MOHAN BABU
తెలంగాణ సాంస్కృతిక చిహ్నం, తొమ్మిది రోజులు పూల సంబరం  బతుకమ్మ పండుగ. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ  నేటితో ప్రారంభం కానుంది. ఇవాళ మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ సంబరాలు దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ తో ముగుస్తాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది బతుకమ్మ పండుగ. ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే వేడుక. ప్రకృతిని ఆరాధిస్తూ  తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడి, పాడి   గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పూల సంబరం.

ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటారు. అదేసమయంలో బతుకమ్మను పేజీ మహిళలు సంబరాలను జరుపుకుంటారు. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలతో బతుకమ్మని పేర్చి ఇంట్లో గౌరీదేవిని తమ ఆటపాటలతో పూజిస్తారు. అందరూ కలిసి బతుకమ్మను పాడతారు ఆడతారు. ఎంగిలిపూల బతుకమ్మ గా మొదటిరోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యప్పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారుచేస్తారు. అమ్మవారికి నైవేద్యం పెట్టే వాటిలో రకరకాల తృణధాన్యాలను వినియోగిస్తారు. బతుకమ్మ అంటేనే పూల పండుగ. ఔషధ గుణాలున్న పూలను  బతుకమ్మగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, పోక బంతి, మల్లె, మందార, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు గుమ్మడి , గులాబీ, పట్టుకుచ్చులు పూలతో చక్కగా బతుకమ్మని పేర్చి బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే.

బతుకమ్మ సంబరాల్లో భాగంగా మహిళలు చక్కగా ముస్తాబై అత్యంత భక్తి శ్రద్ధలతో తయారుచేసిన బతుకమ్మ ను తీసుకొని ఆలయాల్లో,వీధుల్లో అందరూ గుంపుగా కూడి సంబరాలు జరుపుకుంటారు. 9 రోజులపాటు ఆడి బతుకమ్మలను బావి లోనూ, నీటి ప్రవాహాల లోనూ వదిలేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటలను మహిళలు కష్టసుఖాలు, భక్తి,చరిత్ర, పురాణాలు  మేళవిస్తారు. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటి నమ్మా వాయినం అంటూ పళ్లెంలో తెచ్చిన నీళ్లతో వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: