తెలుగు భాషలో ఉన్న తియ్యదనాన్ని తెలుసుకుందామా..?

MOHAN BABU
 తెలుగు భాష తీయదనం.. తెలుగు జాతి గొప్పతనం.. తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం.. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా.. తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా నువ్వు మరువబోకురా అంటూ.. మన భాష సంస్కృతి ఉట్టిపడేలా రచయిత  చంద్రబోస్ ఈ పాటకు ప్రాణం పోశాడు.. తెలుగు భాష గొప్పతనాన్ని ఆయన పదాల్లో ఏ విధంగా వివరించారో అంతకంటే ఎక్కువ తెలుగు భాష గొప్పతనం ఉంటుంది. ప్రస్తుత సమాజంలో పరభాషా మోజులో పడి తెలుగు భాషని మర్చిపోతున్నారు. కొంతమంది  తెలుగు వచ్చినా మాట్లాడకుండా  కొన్ని కొన్ని సందర్భాలను  ఎదుర్కొంటున్నారు. మన తెలుగు భాష దినోత్సవాన్ని గిడుగురామ్మూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29వ తేదీన జరుపుకుంటున్నాం.

మనం విద్యాబోధనలో పండితుల భాష కాకుండా పామరుల భాషను వాడాలని గిడుగు రామ్మూర్తి పంతులు తన జీవితకాలం పోరాటం చేశాడు. అమ్మ భాష అంటేనే అమృతం లాంటిది అని ఇవి అందరికి అందుబాటులో ఉండాలని చేసిన పోరాటాల ఫలితంగా తెలుగు భాష విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఏలికలు మేల్కొని తేనెలొలుకు తేట తెలుగును  రక్షించు కోకపోతే కొవ్వొత్తిలా కరిగిపోయే అవకాశం ఉంది. పర భాషా పద ఘట్టనల కింద నలిగి పోకుండా తల్లి భాష ఉనికిని కాపాడుకోవాలి. తెలుగులో ప్రాచీన కాలంలోనే కాక ఆధునిక కాలంలో కూడా గొప్ప సాహిత్యంవస్తోంది. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 370 ఏ చెప్పిన విధంగా మాతృభాషలో ప్రాథమిక విద్య బోధన కొనసాగించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

ఆర్టికల్ 370 బీ ప్రకారం  ప్రాథమిక విద్య మాతృభాషలో చదువుకొని తర్వాత విద్యార్థుల అభిప్రాయం మేరకు ఏ భాషలోనైనా ఉన్నత విద్య చదువుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో తెలుగు మాట్లాడితే నేరం చేసినట్టుగా భావిస్తున్నారు. శిక్షలు కూడా విధిస్తున్నారు. ఇది మారాలి. ప్రైవేట్ పాఠశాలలు సైతం  ఆరో తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాషను పెట్టాలి. ప్రస్తుత సమాజంలో పరభాషా వ్యామోహంలో పడి తెలుగు భాషకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా మనం అంతా ఏకమై  తెలుగు భాషను ప్రోత్సహించేందుకు నడుం బిగించాలి. మన తెలుగు తేజాన్ని కాపాడుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: