ఆగష్టు 25 : చరిత్రలో ఈ రోజు సంఘటనలు..

Purushottham Vinay
చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనల విషయానికి వస్తే.. 

ఈ రోజుని ఉరుగ్వే జాతీయదినోత్సవంగా జరుపుకుంటారు.

1945 వ సంవత్సరంలో వరంగల్లు జిల్లా బైరాన్‌పల్లి పై, పోలీసులు ఇంకా మిలటరీ సాయంతో..భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేయడం హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపడం జరిగింది. ప్రక్కనే ఉన్న కూటికల్లు గ్రామంపై కూడా వారు దాడి చేయడం జరిగింది.

1960 వ సంవత్సరంలో 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోంలో ప్రారంభమవ్వడం జరిగింది.

2003 వ సంవత్సరంలో బొంబాయి నగరములో కారు బాంబులు పేలుడు విధ్వంసం సృష్టించబడింది.

2007 వ సంవత్సరంలో హైదరాబాద్లో లుంబినీ పార్క్ ఇంకా కోఠి (గోకుల్ ఛాట్) బాంబు పేలుళ్ళ వల్ల 42 మందికి పైగా మృతిచెందడం జరిగింది.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే..

1694 వ సంవత్సరంలో థియోడోర్ వాన్ న్యుహాఫ్ జన్మించారు. ఈయన జర్మన్ సాహసికుడు అలాగే కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధి చెందాడు.

1724 వ సంవత్సరంలో జార్జ్ స్టబ్స్ జన్మించారు. ఇతను ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు.

1865 వ సంవత్సరంలో రాయచోటి గిరిరావు జన్మించారు. ఈయన సంఘ సేవకులు ఇంకా విద్యావేత్త.

1893 వ సంవత్సరంలో కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జన్మించారు. ఈయన హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త ఇంకా బహుముఖ ప్రజ్ఞాశీలి.

1917 వ సంవత్సరంలో దేవులపల్లి రామానుజరావు జన్మించారు. ఈయన రచయిత.

1926 వ సంవత్సరంలో మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము జన్మించారు. ఈయన కవి, రచయిత ఇంకా చిత్రకారుడు.

1952 వ సంవత్సరంలో దులీప్ మెండిస్ జన్మించారు. ఈయన శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..

1822 వ సంవత్సరంలో విలియం హెర్షెల్ మరణించారు. ఈయన వరుణ (యురేనస్‌) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త.

1867 వ సంవత్సరంలో మైకేల్ ఫెరడే మరణించారు. ఈయన ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త ఇంకా భౌతిక శాస్త్రవేత్త.

1908 వ సంవత్సరంలో హెన్రీ బెక్వెరెల్ మరణించారు. ఈయన భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

1953వ సంవత్సరంలో సురవరం ప్రతాపరెడ్డి మరణించారు. ఈయన పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు ఇంకా క్రియాశీల ఉద్యమకారుడు.

1960 వ సంవత్సరంలో చింతా దీక్షితులు మరణించారు. ఈయన రచయిత.

1969 వ సంవత్సరంలో మఖ్దూం మొహియుద్దీన్ మరణించారు. ఈయన కార్మిక నాయకుడు ఇంకా ఉర్దూకవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: