భారతీయుల అద్భుతం ఈ కోణార్క్ సూర్య దేవాలయం

Divya
ప్రపంచంలో; ఎన్నో చారిత్రక కట్టడాలు ఎన్నో రహస్యాలను తమలో దాచుకున్నాయి. అత్యంత పురాతన సాంస్కృతి కలిగిన మన భారతదేశంలో అయితే పురాతన దేవాలయాలను లెక్కపెట్టడం కూడా సాధ్యం కాదు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు.. మన భారతదేశంలో వున్నాయి అంటే మనకు ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు. ఇక మన భారత దేశంలో ఎన్నో అంతుచిక్కని రహస్య దేవాలయాలు వున్నాయి. ఇక ఇప్పటికీ మన భారత దేశంలో చాలా దేవాలయాలను ఎప్పుడు కట్టారు..? ఎవరు కట్టారు..? ఎలా కట్టారు ..? అనే విషయాలు తెలియక వాటి రహస్యాలు ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. అలాంటి ఎన్నో చారిత్రక కట్టడాలలో ముఖ్యంగా కొన్ని దేవాలయాల గురించి చెప్పుకోవాలి..

ఇక ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిన దేవాలయాల్లో కోణార్క్ సూర్య దేవాలయం గురించి చెప్పుకుందాం.. ఈ దేవాలయాన్ని క్రీ.శ.  1236 నుంచి 1264 సంవత్సర మధ్యకాలంలో  గంగ వంశానికి చెందినటువంటి లాంగులానరసింహ దేవ అనే రాజు  ఒడిషా కట్టించినట్లు అక్కడ వెలువడ్డ కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఈ గుడిని 230 అడుగుల ఎత్తులో, 7 గుర్రాలు, 24 చక్రాలు వున్న రథం లా కట్టించారు. ఈ దేవాలయానికి ఒక చరిత్ర కూడా వుంది. పద్మ పురాణం ప్రకారం సూర్యదేవుడు స్వయంగా ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అని చెబుతోంది. అయితే ఈ దేవాలయంలో కొంత భాగాన్ని క్రీ.శ.17 శతాబ్దం లో కూల్చి వేశారు అని చరిత్ర చెబుతోంది.

అలా కూల్చిన ప్రదేశం లో ఏకంగా 52 టన్నుల పెద్ద అయస్కాంతం వుండేదని, ఈ అయస్కాంతం గుడిలో ఉన్న విగ్రహాన్ని తేలేలా చేసేది అని చరిత్రకారులు స్పష్టం చేశారు. అయితే దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని తీసుకోవాలి అంటే కచ్చితంగా అయస్కాంతాన్ని కూల్చివేయాలి. అలా 17వ శతాబ్దంలో అయస్కాంతాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఈ అయస్కాంతాన్ని ఎవరు కూల్చివేశారు..? ఎందుకు కూల్చివేశారు.? అనే విషయాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.
అంతే కాదు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ గుడి కి నిర్మించిన 24 రథ చక్రాలలో  అంతులేని విజ్ఞానం దాగి ఉంది. ఎందుకంటే ఈ రథచక్రాలు సన్ డైల్స్  లాగా పనిచేస్తాయి కాబట్టి. ఈ సన్ డైల్స్ ఇప్పటికీ ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి అంటే మన భారతదేశ నిర్మాణ నైపుణ్యం ఎంతటిదో చక్కగా తెలుస్తోంది. అందుకే ఈ దేవాలయాన్ని యునెస్కో అధికారులు  ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇలా ప్రపంచంలోనే లేని ఎన్నో రహస్య చారిత్రక దేవాలయాలు మన భారతదేశంలో వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: