ప్రతినెలా కొడుకు కోసం 400 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం..?

MOHAN BABU
 తల్లిదండ్రులకు పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుందని చెప్పవచ్చు. తల్లికి ఎక్కువగా కొడుకుపై ప్రేమ ఉంటుంది. అదే తండ్రికి  ఎక్కువ కూతురుపై ప్రేమ ఉంటుంది. అంటే కుటుంబంలో  ఈ విధంగా ప్రేమానురాగాలు కూతుర్లు తండ్రిపై, కొడుకు తల్లిపై ప్రేమను చూపిస్తారని మన అందరికి తెలుసు. కానీ తండ్రి తన కుమారుడి కోసం నాలుగు వందల కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేస్తూ తన కొడుకుని కాపాడుకుంటున్నారు. ప్రతి నెల  ఈ విధంగా నాలుగు వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు.

వివరాల్లోకి వెళితే జార్ఖండ్ కు చెందినటువంటి ఓ తండ్రి తన కొడుకుకు రక్తం మార్పిడి చేయించడం కోసం  ప్రతి నెల  400 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఐదు సంవత్సరాలలో సదరు తండ్రి  పడుతున్న బాధను గుర్తించిన టువంటి  బెంగళూరుకు చెందిన క్రౌడ్ ఫండింగ్ ఆర్గనైజేషన్ మిలాప్ అనే సంస్థ బాలుని సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చింది. నా బాలుడికి ఏమైనది.. వివరాల్లోకి వెళితే జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో  రోజువారి కూలిగా పని చేస్తున్నాడు దిలీప్ యాదవ్. అతని కొడుకు వివేకుకు ఐదేళ్ల క్రితమే  తలసేమియా వ్యాధి రావడంతో ఎముకల యొక్క మజ్జ మార్పిడి చేయాలని  వైద్యులు తెలిపారు. ఆపరేషన్ కొరకు దాదాపు 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేశారు. కాని తండ్రి అంత డబ్బు సమకూర్చడం తలకు మించిన భారంగా తయారైంది. దీంతో సదరు తండ్రి ప్రత్యామ్నాయ మార్గంగా బెంగళూరు రాష్ట్రంలోని ఆస్టర్ దవాఖానాలో ఆ బాలుడికి ప్రతి నెల రక్తం మార్పిడి చేయిస్తూ ఉన్నాడు. దీనికొరకు దిలీప్  తమ యొక్క గ్రామం నుంచి బెంగళూరుకు  ప్రతి నెల 400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు.

ఈ విషయం  ఆ నోట ఈ నోట జాతీయ దినపత్రికలో రావడంతో కౌడ్ ఫండింగ్ సంస్థ  అతనికి సాయం చేయడానికి ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. దిలీప్ తో పాటుగా అతని భార్య నలుగురు పిల్లలకు విమాన  టికెట్ లు అరేంజ్ చేసింది ఆ సంస్థ. ఆస్టర్ దవాఖానలో బాలుడి యొక్క ఎముక మజ్జను  పరీక్షించి, వారిలో ఎవరితోనైనా సరిపోతే వివేక్ అమర్చుతామని  తెలియజేసింది. దీంతో తన తండ్రి మాట్లాడుతూ  నా కొడుకు పై ఆశలు వదిలేసుకున్న సమయంలో మళ్లీ  ఈ మిలాప్ సంస్థ ప్రాణం పోసింది అని, నా కొడుకు సంతోషంగా బతుకుతాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేసినది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: