తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి..?

MOHAN BABU
హిందూ పండుగలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండగ తొలి ఏకాదశి. తెలుగు సంవత్సరం మొదలు అన్ని పండుగలు వెంటపెట్టుకొని తెచ్చుకొని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
 ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఏడాది మొత్తం మీద వచ్చే 24 ఏకాదశుల్లో  ప్రతి నెల కృష్ణ పక్షంలో 1, శుక్ల పక్షంలో 1 మొత్తంగా ఈ రెండు ఏకాదశులు వస్తాయి. ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి. ఏకాదశి అంటే పదకొండు అని మొత్తం వస్తుంది. మనకుండే అటువంటి  ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు వీటిని పని చేయించే అంతా అంతరెంద్రియం అయినా మనసు కలిపితే 11 వస్తుంది. ఈ 11ను ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి.
                            విశిష్టతా
 ఆషాడ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా ప్రజలు జరుపుకుంటారు. దీనిని శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి, హరివసరం అని అంటారు. ఈ దినం నుంచి  మహావిష్ణు క్షీరాబ్ధి యందు శేష పానుపు మీద పడుకుంటాడు. కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒక విధంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే అనేక మార్పులకు  పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు, పరస్పర సంబంధాలను  వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు  ఈరోజు నుంచి  దక్షిణ దిశకు వెళుతున్నట్టు  కనిపిస్తూ ఉంటాడు . అందుకే దీనిని దక్షిణాయానం అంటారు.
           ఏకాదశి జరుపుకునే విధానం నియమాలు
ఏకాదశి రోజున  ఈ వ్రతాన్ని ఆచరిస్తే భూమి దానాలు ఇచ్చినంత, సూర్య చంద్ర గ్రహం లలో, అశ్వమేధ యాగం చేసినంత, 60 వేల సంవత్సరాలు తపస్సు చేసినంత  పుణ్య కార్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
                    ఉపవాస ఫలితములు
 ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకున్నవారు  దశమి రోజున రాత్రి నిరాహారులై ఉండి  ఏకాదశి రోజున  సూర్యోదయానికి ముందు కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి. ఈ రోజు మొత్తం ఉపవాసమే ఉండాలి. ఈ రోజు మొత్తం జాగరణ చేయాలి. మరుసటి రోజు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే  కాలకృత్యాల అనంతరం శ్రీహరి కి పూజ చేసి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.
 ఈ వ్రతం వేసేముందు పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి యొక్క ప్రతిమను లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని పెట్టి కర్పూర హారతివ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: