జూన్ 20వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
ప్ర‌తి సంవ‌త్స‌రంలో ఉండే అనేక తేదీల‌కు ఎన్నో విశేషాలు, వింత‌లు క‌లిగి ఉంటాయి. అయితే ఆయా తేదీల్లో ఎన్నో ర‌కాల ప్ర‌ముఖ‌మైన సంఘ‌ట‌న‌ల‌కు అద్దంలా ఉంటాయి. కాగా ఆ రోజు ఖ‌చ్చితంగా ఏదో ఒక విశేష‌మైన కార్య‌క్ర‌మం జ‌రిగి ఉంటుంది. కాబ‌ట్టి అలాంటి డేట్ల‌ను మ‌నం గుర్తు పెట్టుకుని మ‌రీ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం సాంప్ర‌దాయం. మ‌రి చరిత్ర‌లో ఈరోజు జూన్ 20కి కూడా ఎంతో విశేష‌త ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
♥ జననాలు ♥
✦  1566: స్కాట్లాండ్ రాజు జేమ్స్ VI ఈ రోజు జ‌న్మించారు. ఆ తరువాత జేమ్స్ 1 పేరుతో ఇంగ్లాండ్ రాజు అయ్యాడు (మ.1625).
✦  1623: ఫ్రెంచ్ తత్వవేత్త, ప్ర‌ముఖ గణిత శాస్త్రవేత్త అయిన బ్లేజ్ పాస్కల్ ఈరోజు పుట్టాడు (మ.1662).
✦  1856: ఎల్బెర్ట్ హుబ్బార్డ్, రచయిత (మ.1915) జ‌న్మించారు.
✦  1889: చీరాల-పేరాల ఉద్యమనేత అయిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య  (మ.1928) జ‌న్మించారు.
✦  1876: చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు,, నాటకకర్త (మ. 1956) ఈరోజు జ‌న్మించారు.
♡ మరణాలు ♡
✦ 1919:  నాటక రచయిత, న్యాయవాది అయిన కోలాచలం శ్రీనివాసరావు(జ.1854) మ‌ర‌ణించారు
✦ 1986: ముర్రే పి హేడన్, కృత్రిమ గుండె గ్రహీత, కృత్రిమ గుండె పెట్టిన 16నెలల తరువాత, లూయిస్ విల్లే అనే చోట (కెంటకీ రాష్ట్రం) ఈరోజు మరణించాడు
✦ 1972: స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త అయిన కొచ్చెర్లకోట రంగధామరావు (జ.1898)మ‌ర‌ణించారు.
✦ 1987: భారత పక్షి శాస్త్రవేత్త అయిన‌ సలీం అలీ(జ.1896) మ‌ర‌ణించారు.
✦ 2013: ఆలూరు భుజంగ రావు, విరసం సీనియర్‌ సభ్యుడు, రచయిత, అనువాదకుడు (జ.1928)ఈరోజు మ‌ర‌ణించారు.
 
✷ పండుగలు, జాతీయ దినాలు ✷
✦ ఈరోజు మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం.
✦ ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఈరోజు.

✷ సంఘటనలు ✷
✦  1910: ఫాదర్స్ డే (తండ్రుల దినోత్సవం) ని మొట్ద మొద‌టిసారిగా స్పోకనే (వాషింగ్టన్ ) లో  ఈరోజు జరుపుకున్నారు
✦  1931: మొట్టమొదటి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ను వాణిజ్యపరంగా, వెస్ట్ హెవెన్, కనెక్టికట్ రాష్ట్రంలో (అమెరికా) ఈరోజు ప్రవేశపెట్టారు.
✦  1947: మొట్టమొదటి సారిగా గంటకి 600 మైళ్ళ (1004 కి.మీ) వేగంతో న‌డిచే విమానం (ఎఫ్ – 80) ప్రయాణించింది. ఈ విమానాన్ని ఆల్బర్ట్ బోయ్ద్, అనే పైలట్, మురాక్ (కాలిఫోర్నియా) ఈరోజు నడిపాడు.
✦  1957: సోవియట్ రష్యా త‌న తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1ని ఈరోజు అంతరిక్షంలోకి పంపింది.
✦  2003: వికీమీడియా ఫౌండేషన్ ను ఈరోజు స్థాపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: