క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు ఏప్రిల్ 29వ కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ముఖ్య సంఘటనలు:
1986: అమెరికాలోని సెకండ్ లార్జెస్ట్ సిటీ అయిన లాస్ ఏంజిల్స్ పబ్లిక్ సెంట్రల్ లైబ్రరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 400,000 పుస్తకాలు, ఇతర వస్తువులను
కాలి బూడిదయ్యాయి. ఉద్దేశపూర్వకంగా ఈ లైబ్రరీకి నిప్పు అంటించారని ఆరోపణలు వచ్చాయి కానీ అసలైన నేరస్తుడిని ఇంతవరకు ఎవరూ పట్టుకోలేకపోయారు.
1991: ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాలో గంటకు 249 కిలోమీటర్ల గాలులతో విజృంభించిన తుఫాన్ కారణంగా కనీసం 1,38,000 మంది మరణించారు. ఈ విపత్తు కారణంగా
కోటి మంది నిరాశ్రయులయ్యారు.
ప్రముఖల జననాలు:
1848:
రాజా రవివర్మ, ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు, కళాకారుడు (మ.1906)
1867: డా.శంకర్ అబాజీ భోసే, భారతీయ శాస్త్రవేత్త (మ.1935)
1891: భారతీదాసన్,
తమిళ కవి
రచయిత హేతువాది (మ.1964)
1919: ఉస్తాద్ అల్లరఖ ఖురేషి, భారత తబలా విద్వాంసుడు. (మ. 2000)
1936: జుబిన్ మెహతా, పాశ్చాత్య, తూర్పు శాస్త్రీయ సంగీతం యొక్క భారతీయ కండక్టర్.
1958: రామచంద్ర గుహ, భారతీయ రచయిత.
ప్రముఖుల మరణాలు:
1960: బాల
కృష్ణ శర్మ నవీన్, భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, పాత్రికేయుడు, రాజకీయవేత్త,
హిందీ సాహిత్య కవి. (జ.1987)
1980: ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్, ఆంగ్ల చిత్ర దర్శకుడు,
నిర్మాత, స్క్రీన్ రైటర్.(జ.1899)
2006: జెకె గాల్‌బ్రైత్, కెనడియన్-అమెరికన్ ఆర్థికవేత్త.(జ.1908)
జాతీయ దినాలు:
మోడర్న్ బ్యాలెట్ (భలే
నృత్య నాటిక) డాన్స్ సృష్టికర్త జీన్-జార్జెస్ నోవెర్రే జన్మదినమైన ఏప్రిల్ 29 ని
అంతర్జాతీయ నృత్య దినోత్సవం( ఇంటర్నేషనల్ డాన్స్ డే) గా ప్రకటించారు.