సెప్టెంబర్ 27వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?
ముఖ్య సంఘటనలు
1821: మెక్సికో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందినది.
2008: చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
2008: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితుడైనాడు.
జననాలు
1898: కుందూరి ఈశ్వరదత్తు, పాత్రికేయుడు. ది లీడర్ ఆంగ్ల దినపత్రిక ప్రధాన సంపాదకుడు. (మ.1967)
1909: ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు. (మ.1969)
1915: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (మ.2012).
1933: నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు, రంగస్థల నటుడు. (మ.2009)
1936: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2009)
1953: మాతా అమృతానందమయి, మానవతా కార్యక్రమాల ద్వారా ఆమె పేరొందారు.
ప్రముఖుల మరణాలు
1719: జార్జ్ స్మాల్రిడ్జ్, బ్రిస్టల్ ఇంగ్లీష్ బిషప్. (జ.1662)
1833: రాజా రామ్మోహన రాయ్, భారత సాంస్కృతిక ఉద్యమ పితామహుడు (జ.1772).
1939: దాసు విష్ణు రావు, న్యాయవాది. (జ.1876)
1972: గోగినేని భారతీదేవి, స్వతంత్ర సమర యోధురాలు, సంఘ సేవిక (జ.1908).
2001: కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (జ.1920).
1996: నజీబుల్లా, అప్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు (జ.1947).
1997: మండలి వెంకటకృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (జ.1926).
పండుగలు , జాతీయ/దినాలు
ప్రపంచ పర్యాటక దినోత్సవం: 1980 నుండి సెప్టెంబర్ 27ను ప్రపంచ పర్యాటక దినంగా ప్రకటించింది. ప్రపంచ పర్యాటక రంగంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణిస్తారు. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక, జీవన విధానాల మీద అవగాహన దీని ముఖ్య ఉద్దేశం.