సెప్టెంబ‌ర్ 8వ తేదికి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 8వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

జననాలు

1862: వేంకట శ్వేతాచలపతి రంగారావు, బొబ్బిలి జమీందారీకి రాజు (మ1921).సర్ వేంకట శ్వేతాచలపతి రంగారావు బహదూర్ జి.సి.ఐ.ఈ జమీందారు. 1881 నుండి 1921వరకు బొబ్బిలి జమీందారీకి రాజు. ఈయన మనమడు రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు 1932 నుండి 1936 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
1879: మొక్కపాటి సుబ్బారాయుడు, పరిపాలనా దక్షుడు, పండితుడు. (మ.1918).  పరిపాలనా దక్షుడు, పండితుడు. ప్రఖ్యాత హాస్యరచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి ఈయన సహోదరుడు. ఈయన 1879 సంవత్సరం సెప్టెంబరు 8 తేదీన జన్మించాడు. ఈయన ముత్తాత షట్ఛాస్త్రవేత్త, శ్రౌతి అయి పెద్దాపురం రాజా వత్సవాయి విద్వత్తిమ్మ జగపతి మహారాజు వద్ద మొగలితుర్రు సంస్థానంలో అఖండ రాజ గౌరవాలు పొందాడు.
1908: చెలికాని అన్నారావు, తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి.
1910: త్రిపురనేని గోపీచంద్, తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1962)
1931: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు. (మ.1984)
1933: ఆశా భోస్లే, హిందీ సినిమా గాయని.
1933: కరుటూరి సూర్యారావు, గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామికవేత్త. (మ.2011)
1936: చక్రవర్తి, సంగీత దర్శకుడు. (మ.2002)
1951: మాధవపెద్ది సురేష్, తెలుగు సినీ సంగీత దర్శకుడు.
1975: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. (మ.2016)
1986: పారుపల్లి కశ్యప్, భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.

మరణాలు
1918: రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (జ.1865)
1963: గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రయోక్త, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. (జ.1915)
1981: మాస్టర్ వేణు, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1916)
1996: మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (జ.1949)
2012: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (జ.1949)

పండుగలు , జాతీయ దినాలు
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం (ఫిజియోథెరపీ)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: