చరిత్రలో ఈరోజు : 02-08-2020 రోజున ఏం జరిగిందంటే..?
పింగళి వెంకయ్య జననం : భారతదేశ జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధులు అయిన పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. ఈయన 1916 సంవత్సరంలో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంధాన్ని కూడా రచించారు. 19 ఏళ్ల వయసులోనే దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆఫ్రికాలో ఉన్న సమయంలోనే మహాత్మా గాంధీని కలిసిన పింగళి వెంకయ్య.. ఆయనతో ఎంతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఇక జాతీయ పతాకం రూపకల్పనలో ఎంతగానో కృషి చేసిన పింగళి వెంకయ్య ఎన్నో చర్చల అనంతరం...త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు.
మల్లాది సుబ్బమ్మ జననం : స్త్రీవాద రచయిత్రి హేతువాది స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు అయిన మల్లాది సుబ్బమ్మ 1924 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. స్త్రీలు కేవలం వంటింటి మాత్రమే పరిమితం అయి వెట్టిచాకిరి చేయడమేనా అంటూ ప్రశ్నించి గళమెత్తిన స్త్రీవాది మల్లాది సుబ్బమ్మ. కుల నిర్మూలన ఛాందసవాద వ్యతిరేక పోరాటం మూఢవిశ్వాసం నిర్మూలన స్త్రీ జనోద్ధరణ కుటుంబనియంత్రణ స్త్రీ విద్య కోసం ఎంతగానో కృషి చేశారు మల్లాది సుబ్బమ్మ. జీవితం మొత్తం స్త్రీ విద్య కోసం స్త్రీ అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడ్డారు. ఇక స్త్రీల అభ్యున్నతి కోసం మహిళ అభ్యుదయ సంస్థ లాంటివి స్థాపించారు మల్లాది సుబ్బమ్మ.
లాల్ జాన్ భాషా జననం : ప్రముఖ రాజకీయ వేత్త తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు అయిన లాల్ జాన్ బాషా 1956 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. 1984లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి లోక్ సభ లో అడుగుపెట్టారు ఈయన. తర్వాత భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభను కూడా ఎన్నికయ్యారు. గుంటూరులో కీలకమైన నాయకుడిగా ఎదిగిన లాల్ జాన్ బాషా.. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
దేవిశ్రీప్రసాద్ జననం : దక్షిణ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు అయిన దేవిశ్రీప్రసాద్ 1979 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. దేవిశ్రీప్రసాద్ శాస్త్రీయ సంగీత నేపథ్యమున్న కుటుంబంలో జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు దేవిశ్రీప్రసాద్. ఎన్నో సినిమాలకు తనదైన మ్యూజిక్ అందిస్తూ ఎంతో మంది శ్రోతులను ఉర్రూతలూగించారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే ఇష్టపడని ప్రేక్షకుడు లేదు అనడంలో అతిశయోక్తి లేదు.
అలెగ్జాండర్ గ్రహంబెల్ మరణం : అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు అయిన అలెగ్జాండర్ గ్రహంబెల్ 1922 ఆగస్టు 2వ తేదీన పరమపదించారు.ఈయన టెలిఫోన్ ని కనిపెట్టారు. కానీ ధ్వని శాస్త్రం, వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలో ప్రొఫెసర్ గా చేసిన అలెగ్జాండర్ గ్రహంబెల్ ఎన్నో ప్రయోగాలు చేసి తీగల ద్వారా శబ్దతరంగాలను పంపగల టెలిఫోన్ కనుగొన్నారు.
దేవదాస్ కనకాల మరణం : తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత శిక్షకుడు అయినా దేవదాస్ కనకాల 2019 ఆగస్టు 2వ తేదీన మరణించాడు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు ఎన్నో ధారావాహికలో కూడా నటించారు. 2018 లో మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమా... దేవదాస్ కనకాల నటించిన చివరి సినిమా కావడం గమనార్హం.Powered by Froala Editor