చరిత్రలో ఈరోజు : 11-03-2020 రోజున ఏం జరిగిందంటే..?

praveen

ఒకసారి చరిత్రలోకి  చూస్తే మార్చి 11వ తేదీన ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఇంకెంతో మంది ప్రముఖుల జననాలు దొరికాయి. మరి ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 సోవియట్ యూనియన్ : 1990 మార్చి 11వ తేదీన సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథువేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 

 

 

 వీరేంద్ర సేహ్వాగ్  రికార్డ్ : భారత దిగ్గజ క్రికెటర్ లో ఒకరైన వీరేంద్ర సెహ్వాగ్ భారత్ కు  ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఎన్నో రికార్డులను కూడా నెలకొల్పారు. 2009 మార్చి 11వ తేదీన వన్డేలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సేవ రికార్డు సృష్టించాడు. 

 

 

 విజయ్ హజారే జననం : భారత దిగ్గజ ఆటగాడు లో ఒకరు భారత జట్టు మాజీ కెప్టెన్ అయిన విజయ్ హజారే 1917 మార్చి 11వ తేదీన జన్మించారు. ఈయన 30 టెస్ట్ లకు  భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్ క్రికెట్లో విజయ్ హజారే అత్యధిక స్కోరు 164. ఇక కేవలం బ్యాట్ తోనే కాదు బాల్ తో కూడా తన సత్తా చాటాడు విజయ్ హజారే. బౌలింగ్ లో ఏకంగా 25 వికెట్లు  కూడా తీసుకున్నాడు. 1951 నుంచి 53 మధ్యకాలంలో 14  టెస్ట్ లకు  నాయకత్వం వహించాడు విజయ్ హజారే. ఇక 1951- 52 ఇంగ్లండ్ తో  జరిగిన భారత్ యొక్క 25వ టెస్ట్ మ్యాచ్లో విజయ్ హజారే నాయకత్వంలో భారత తొలి టెస్టు విజయాన్ని అందుకున్నాడు. అంతేకాకుండా 1947-48 నెలల్లో ఆస్ట్రేలియా తో  జరిగిన రెండో  మ్యాచ్లలో రెండు ఇన్నింగ్స్ లోను  సెంచరీలు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు విజయ్ హజారే. అంతే కాదు రెండు ఎన్నికల్లోనూ కేవలం ఏమీ పరుగులు చేయకుండా అవుట్ అయిన తొలి భారతీయుడు కూడా విజయ్ హజారే. వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీలు సాధించిన తొలి భారతీయుడిగా కూడా విజయ్ హజారే రికార్డు సృష్టించాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత కొద్దికాలం టెస్ట్ క్రికెట్ సెలెక్టర్ గా కూడా పని చేసాడు  విజయ్ హజారే. భారత క్రికెట్ దిగ్గజాలలో సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కర్ తర్వాత విజయ్ హజారే మూడవ స్థానం. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను పది డబుల్ సెంచరీలు కూడా సాధించాడు ఏకంగా 595 వికెట్లు సాధించాడు విజయ్ హజారే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ విజయ్ హజారే. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీలు సాధించిన భారతీయులలో  ఇతనే ప్రప్రథముడు. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50 సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు కూడా విజయ్ హజారే.ఇక ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాలో సేవలందించి ఆ తర్వాత ఆట నుంచి విరమించారు. ఇక భారత ప్రభుత్వం తన సేవలను గుర్తించి పద్మశ్రీ బిరుదును కూడా సత్కరించింది. అంతేకాదు విజయ్ హజారే పేరుతో ఒక ట్రోఫీని కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. 

 

 

 మాధవపెద్ది సత్యం జననం : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు రంగస్థల నటుడు అయినా  మాధవపెద్ది సత్యం 1922 మార్చి 11వ తేదీన జన్మించారు. ఈయన  కేవలం తెలుగు భాషలోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీ సింహళ భాషలో కూడా ఎన్నో పాటలు పాడి ప్రసిద్ధి చెందారు. దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 కు పైగా పాటలు పాడి ప్రసిద్ధిచెందారు మాధవపెద్ది సత్యం  అయితే చిన్నతనం రంగస్థల నాటకాలలో ఆసక్తిగల మాధవపెద్ది సత్యం.. అలా రంగస్థల నటుడిగా  అంచలంచలుగా ఎదిగి.. తిరుమలలో పాటలు పాడే అవకాశం కూడా దక్కించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రఖ్యాతి గాంచినది సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులతో పనిచేశారు ఈయన. దాదాపు ఎస్వీ రంగారావు, రేలంగి వెంకటరామయ్య పాటలన్నీ దాదాపు ఈయనే పాడారు. 72 ఏళ్ళ వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంకురాత్రి పండుగొచ్చే అనే పాట పాడి  పలువురి ప్రశంసలు అందుకున్నాడు. సింధూరం సినిమాలో పాడిన సంక్రాంతి పండుగ పాట... ఎంతగానో హిట్టయింది. ఇక ఈయన 2000 సంవత్సరంలో  మరణించారు. 

 

 

 చిన్నబోయిన కమలమ్మ జననం : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిన్న  బోయిన కమలమ్మ 1926 మార్చి 11వ తేదీన జన్మించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నయనాల గ్రామంలో జన్మించారు. అయితే ఈమెకు చిన్నతనం లోనే వివాహం జరిగింది. ఆ రోజుల్లో గ్రామాల్లో కొనసాగుతున్న నిజాం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ పోరాటానికి సిద్ధమయ్యారు చిన్నబోయిన కమలమ్మ. భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపుమేరకు మద్దికాయల ఓంకార్ నాయకత్వంలో భర్త తో కలిసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అయితే అప్పటికే ఆమెకు ఒక కుమారుడు ఉండగా చిన్నారిని అత్తా మామ వద్ద  వదిలేసి పోరాటంలో నిమగ్నమైంది చిన్నబోయిన కమలమ్మ. ఉద్యమం జరుగుతున్న సమయంలో వీరికి రెండవ కుమారుడు కూడా పుట్టగా అదే సమయంలో ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆ శిశువును  పరిస్థితుల్లో కోయజాతి వాళ్లకు అప్పగించారు. ఈమె పాడిన విప్లవ గీతాలు జాన పదాలు ప్రజలను ఉర్రూతలూగించాయి. ఎన్నో  ఉద్యమ పాటలు పాడి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు చిన్నబోయిన కమలమ్మ.తెలంగాణ ప్రభుత్వం ఈమె చరిత్రను ఏకంగా 8 9వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకాలు పాఠ్యాంశంగా కూడా చేర్చారు. మహిళా దినోత్సవం  సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 2016లో తెలంగాణ విశిష్ట మహిళా పురస్కారం తో సత్కరించింది 2018 సంవత్సరంలో మరణించాడు. 

 

 

 రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మరణం : తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణశర్మ అపరిచితుడు. విమర్శనా కృత్తులలో వీరు మార్గదర్శకుడు. అన్నమాచార్యులు వారి కృతులను కొన్ని వందల కృతులను ఆయన స్వరపరిచి తెలుగువారికి అందించారు. వేమనపై సాధికారమైన విమర్శలు కూడా చేశారు. ఈయన  1979 మార్చి 11వ తేదీన మరణించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: