టైం పాస్ కు తినే ఈ ఆహారంతో.. ఎన్ని లాభాలు ఉన్నాయా?
ఈ సింపుల్ స్నాక్ పోషకాల స్టోర్ హౌస్ అని చెబుతున్నారు మరి. మరీ ముఖ్యంగా దేశవాళీ సెనగల్లో ఎ, సి, బి6, నియాసిన్, ఫోలేట్, థైమీన్, రిబోఫ్లేవిన్... వంటి విటమిన్లు, ఫాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, కాపర్ వంటి మినరల్స్ ఎన్నో ఉంటాయి. వేయించిన శనగల్లో ఫైబర్, ప్రొటీన్ సమృద్ధిగా ఉండడం వలన ఒంటికి శక్తి చేకూరడమే కాకుండా... జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఈ శనగల్లో.. దాదాపు 18 గ్రాముల ఫైబర్, 20 గ్రాముల ప్రొటీన్ అధికంగా ఉంటుంది. వేయించిన శనగల్లో.. ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి, ఇది బరువు తగ్గడానికి కూడా ఇది అద్భుతంగా సహాయపడుతుంది.
అంతేకాదండోయ్... వేయించిన శనగల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడంతో కాలరీల శాతం తగ్గుతుంది. బరువుతో పాటు నడుం చుట్టు కొలత కూడా తగ్గుతుంది. ప్రాసెస్ ఫుడ్, చిప్స్‌ను వదిలేసి... మీ స్నాక్స్‌లో వేయించిన శనగలు చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గుతారు అని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా వేయించిన శనగల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతుంది. రోజూ వేయించిన శనగలు తీసుకుంటే.. శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది. ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది. అదేవిధంగా ఇందులోని రాగి, ఫాస్పరస్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, ఫాస్పరస్ స్థాయిలు గుండె సమస్యల ముప్పును తగ్గిస్తాయి.