కేవలం వీకెండ్స్ లో మాత్రమే తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకోండి?

praveen
వారానికి ఒక్క రోజు మద్యం తాగినా కాలేయం దెబ్బతింటుందా? అని ప్రశ్నిస్తే అవుననే సమాధానం చెబుతున్నారు వైద్యులు. తాజాగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఫోటో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో ఒక ఆరోగ్యవంతమైన కాలేయం, దెబ్బతిన్న కాలేయం ఎలా ఉంటాయో కనిపించింది. ఈ డ్యామేజ్డ్‌ లివర్ 32 ఏళ్ల ఒక యువకుడిది. ఆశ్చర్యంగా ఉందా? అతను వారానికి ఒక్క రోజు మాత్రమే మద్యం తాగుతాడు.
‘లివర్ డాక్టర్’ అని పిలిచే సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అనే వైద్యుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన చెప్పినదేంటంటే, వారానికి ఒక్క రోజు మద్యం తాగినా కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందని. ఈ యువకుడి లివర్ ఇమేజ్‌ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఈ ఫోటోలు చూసిన వారందరూ షాక్ అయ్యారు. మన శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైన అవయవం. అది మన శరీరాన్ని విషాల నుండి రక్షిస్తుంది. మద్యం కాలేయానికి చాలా హాని కలిగిస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం తాగడం మానేయడమే మంచిది.
మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు. కానీ, చాలామంది వీకెండ్స్‌లో లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తాగితే ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని భావిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం మాత్రం వేరు. వారానికి ఒక్క రోజు లేదా రెండు రోజులు మాత్రమే మద్యం తాగినా కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని చెబుతున్నారు. కాలేయం పై భారం పెరుగుతుంది. దీంతో కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, మద్యం తాగడం వల్ల రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత సమస్యలు, మనోవైకల్యాలు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
లివర్ (కాలేయం) వ్యాధుల నిపుణులుగా పేరున్న డాక్టర్ ఎస్.కె. సరిన్ మాట్లాడుతూ తన ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే రోగుల్లో 48% మంది మద్యం అలవాటు ఉన్నవారే అని చెప్పారు. అంతేకాదు, కాలేయం పూర్తిగా దెబ్బతిని మార్పిడి చేసుకోవాల్సిన అవసరం వచ్చిన రోగుల్లో ఎక్కువ మంది మద్యం వల్లే ఈ పరిస్థితికి చేరుకున్నారని తెలిపారు. ఇండియాలో మద్యం వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు ఎక్కువ మద్యం తాగుతున్నారు. అంతేకాదు, చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ మొత్తంలో తాగుతున్నారు. ఇక, మధుమేహం, బరువు పెరగడం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మద్యం తాగితే, కాలేయానికి కలిగే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారి సంఖ్య భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది.https://x.com/theliverdr/status/1864890610811105380?t=SN6Nnc9--pLpi5rbvjRgjA&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: