వీటిని తింటే చాలు.. మలబద్ధ సమస్యకు చెక్..!

Divya
ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితం వల్ల చాలామంది ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుందని వాస్తవానికి చలికాలంలో శరీరంలో కూడా నీటి కొరత ఎక్కువగా ఏర్పడుతుందట.. మనం తినేటువంటి ఆహారం వల్ల మలబద్ధక సమస్య కూడా ఏర్పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. మనం తినేటువంటి ఆహారాలలో ఎక్కువగా ఫైబర్, పోషకాలు ఉండేలా చూసుకోవాలట. ఇది జీర్ణ వ్యవస్థను సైతం ఆరోగ్యంగా ఉంచడం వల్ల మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.

1). ఖర్జూరంలో సహజమైన చక్కెర పదార్థాలు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను సైతం ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుందట. అలాగే ప్రేగులను కూడా శుభ్రపరిచేలా చేస్తుంది.రెండు మూడు ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మలబద్ధక సమస్యకు పరిష్కారం అవుతుందట.

2). చిలగడ దుంప దీనిని చాలామంది స్వీట్ పొటాటో అని పిలుస్తూ ఉంటారు.ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది ప్రేగు కదలికలను కూడా పెంచుతుంది. దీనివల్ల మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుంది ఈ చలికాలంలో వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందట.

3). పప్పు ధాన్యాలు మొలకలతో వీటిని తినడం వల్ల ఇందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి చాలా సహాయపడతాయట.. ముఖ్యంగా ఈ చలికాలంలో సెనగలు, బీన్స్, మసూర్ పప్పు ఇతర వాటిని తీసుకోవడం వల్ల ప్రేగు కదలికలు పెరిగి మలబద్ధక సమస్యను తగ్గిస్తుందట.

4). వంటింట్లో దొరికేటువంటి సోంపు తో చేసిన వాటిని తినడం వల్ల కడుపు చాలా చల్లబడుతుందని దీనివల్ల జీర్ణ క్రియ కూడా సులభంగా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల పేగు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే గ్యాస్ ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుందట. సోంపు టీ చేసుకొని తాగడం వల్ల మంచి లాభాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: