జ్ఞాపక శక్తి తగ్గిపోతుందా.. అయితే ఇలా చేయండి?

praveen
ఒత్తిడి డిప్రెషన్ అనేవి నేటి రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఉరుకుల పరుగుల జీవితంలో పనిమీద ఎక్కువ ధ్యాస పెడుతున్న మనిషి అది ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేశాడు. మానేయటం కాదు ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం మనిషి దగ్గర లేకుండా పోయింది. మనీ వెంట పడుతూ పడుతూ చివరికి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా కొనితెచ్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇక నేటి రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి కారణంగా ఎంతో మంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి లైఫ్ స్టైల్ కారణంగా ఎంతో మందిలో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక  కేవలం నిమిషాల వ్యవధిలోనే ఒకచోట పెట్టిన వస్తువుని గుర్తు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలామంది. కాగా ఇలాంటి జ్ఞాపకశక్తి తగ్గిపోవడం లాంటి తేడాను చాలామంది గమనించే ఉంటారు. అయితే ఒత్తిడి డిప్రెషన్ వ్యక్తిగత కారణాలవల్ల ఇలా జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది అని నిపుణులు చెబుతూ ఉంటారు.

 కాగా ప్రతి ఒక్కరు జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేందుకు కొన్ని నియమాలు పాటిస్తే బాగుంటుంది అని సూచిస్తున్నారు. జ్ఞాపకశక్తి బాగుండాలి అంటే మెదడుకు వ్యాయామం తప్పనిసరి అంటూ చెబుతున్నారు. ఆసక్తిని పెంచే పుస్తకాలు చదవాలి పజిల్స్ నింపడం రోజు ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయడం చేయాలట. అంతే కాకుండా బాగోద్వేగాలను  అదుపులో పెట్టుకోవాలని సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా శారీరక వ్యాయామాలు కూడా చేయాలని చెబుతున్నారు. సామాజిక కార్యకలాపాల్లోనూ పాల్గొనాలి అంటూ చెబుతున్నారు అందుకే బ్రెయిన్ ఎప్పుడు పదును పెడుతూనే ఉండాలి అంటూ సూచిస్తున్నారు. ఇలా తరచూ మెదడుకు పదును పెట్టడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం కాదు మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: