దీపావళి టపాసుల పొగ.. పీల్చితే ఎంత ప్రమాదమో తెలుసా..?

Divya
ఈరోజు దీపావళి కావడం చేత ప్రజలు అందరూ కూడా దీపావళి పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు , క్రాకర్స్ ,చిచ్చుబుడ్డి, భుచక్రాలు ఇతరత్రా వాటిని కాల్చడానికి మక్కువ చూపుతూ ఉంటారు. అయితే వీటి ద్వారా వచ్చేటువంటి పొగ పీల్చితే చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఒకవేళ పీల్చితే  ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దీపావళి టపాసుల పొగ ఆస్తమా, ఇతర శ్వాస వ్యాధులతో ఇబ్బంది పడే వారికి చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు. దీపావళి టపాసులు నుంచి వెలుపడే పొగ సల్ఫర్, నైట్రెఇడ్ ఎక్కువగా ఉంటుందట. ఇవి ఎవరైనా పిలిస్తే చాలా ప్రమాదమట. దీనివల్ల ఊపిరితిత్తులకు చాలా ప్రమాదం వాటిల్లుతుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు టపాసులను కాల్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ తెలియజేస్తున్నారు. ఆస్తమా రోగులకు ఈ పొగను పీల్చడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆస్తమా రోగులు పటాకుల నుంచి విడుదల అయ్యే పొగను పీల్చితే అందులో ఉండే రసాయనాల వల్ల ఆస్తమా మరింత ఎక్కువ అవుతుందట. అంతేకాకుండా ఈరోజు కాలుష్యం కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివారు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ వెళితే మాస్క్ ధరించి వెళ్లడం మరియు ముఖ్యము. సేఫ్టీ కి తగ్గట్టుగా అన్ని పరికరాలను కూడా తమ దగ్గరే ఉంచుకోవడం చాలా ముఖ్యము. అలాగే నీరు ఈరోజు కాస్త ఎక్కువగా తాగడం వల్ల తేమ తగ్గకుండా ఉంటుంది. ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపిస్తే ఖచ్చితంగా ఇది ఆరోగ్యానికి హానికరం కలిగిస్తుంది. అలాగే సాయంత్రం లేదా కాస్త వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే కిటికీలు తలుపులు మూసివేయడం వల్ల పొగ లోపలికి రాకుండా ఉంటుంది. అందుకే టపాసులు పొగ చాలా ప్రమాదమని వైద్యులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: