హెల్త్ టిప్స్: బొడ్డు చుట్టూ నెయ్యితో మసాజ్ చేస్తే ఇక అల్లకల్లోలమే.!

FARMANULLA SHAIK
నాభి లేదా బొడ్డును తరచుగా మన రెండవ మెదడు అంటారు. ప్రకృతి వైద్యంలో నాభిని శక్తికి కేంద్రంగా వర్ణించారు. తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పు ఈ నాభి ద్వారానే శిశువు మనుగడకు పోషకాలు అందుతాయి. అయితే ఈ నాభికి నెయ్యిని పూయాలని పురాతన వైద్యం చెబుతోంది. ఆయుర్వేదం ప్రకారం నాభి అనేది ప్రాణం అయితే, దానికి నెయ్యిని అనేది శక్తిని అందించేది. ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథాలు సుశ్రుత సంహిత, చరక సంహితలో పేర్కొన్నట్లుగా, దేశీ నెయ్యి అపారమైన ఔషధ లక్షణాలను కలిగి ఉంది. నాభిలో దేశీ నెయ్యి పూయడం వల్ల జీవశక్తి లభిస్తుంది, ఇంకా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.ప్రతి రాత్రి నెయ్యి నిద్రపోయే ముందు నాభికి దేశీ నెయ్యి పూయాలి, ఆపై బొడ్డును సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఎలాంటివో, కొన్ని ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.నెయ్యి పూయడం ద్వారా బొడ్డును శుభ్రం చేయడం వల్ల నాభిలో పేరుకుపోయిన మురికి, బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఇది పొట్ట, నాభి ప్రాంతాలను ఏవైనా అనారోగ్య సమస్యలు రాకుండా దూరంగా ఉంచుతుంది.ఇది కడుపులో యాసిడ్ స్రావానికి సహాయపడుతుంది, ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడానికి, గ్రహించడానికి సహాయపడుతుంది.నాభి శరీరంలోని మిగిలిన భాగాలతో సంక్లిష్టంగా ముడిపడి ఉంటుంది. నెయ్యితో మర్దన చేయడం వల్ల ముఖానికి, చర్మానికి మేలు జరుగుతుంది. నాభికి పూసిన నెయ్యి, చర్మంపై మచ్చలను నయం చేస్తుంది. ప్రకాశవంతమైన, మృదువైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.అలాగే పగిలిన పెదాలను మెరుగుపరుస్తుంది, ప్రకాశవంతమైన రంగును ఇస్తుంది.నెయ్యిలో వుండే విటమిన్ ఎ, విటమిన్ ఇ జుట్టును కండిషన్ చేస్తాయి.కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.ఇదిలావుండగా బొడ్డుపై గోరువెచ్చని నెయ్యిని క్రమం తప్పకుండా పూయడం వల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్, చలనశీలతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మగవారిలో పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆడవారిలో సంతానోత్పత్తిని పెంచుతుంది. ఇది బహిష్టు సమయంలో వచ్చే తిమ్మిర్లు, నొప్పులను కూడా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: