దంతాలు పసుపురంగులో ఉన్నాయా..ఐతే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే..?

FARMANULLA SHAIK
సాధారణంగా కొందరి దంతాలు బాగా గార పట్టి పసుపు రంగులో ఉంటాయి.ఇటువంటి దంతాలు క‌లిగిన వారు కొంత అసౌకర్యానికి గురవుతుంటారు.ఇతరులతో మాట్లాడేందుకు, నలుగురిలో నవ్వేందుకు ఇబ్బంది పడుతుంటారు.ఈ క్రమంలోనే దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.కొందరైతే వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే పసుపు దంతాలకు గుడ్ బై చెప్పవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.దంతాలను తెల్లగా మార్చే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా తెల్లగా ఉండే ఒక టూత్ పేస్ట్ ను ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసేసి మెత్తగా చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ ను కూడా గిన్నెలో వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి. తరువాత ఇందులో చిటికెడు పసుపును వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల దంతాలను తెల్లగా మార్చే పేస్ట్ తయారవుతుంది.ఈ పేస్ట్ ను తరచూ ఉపయోగించే పేస్ట్ వలె ఉపయోగించాలి. అలాగే ఈ టూత్ పేస్ట్ ను ఉపయోగించేటప్పుడు ధూమపానం, మద్యపానం వంటి వాటిని ఆపేయాలి. ఈ టూత్ పేస్ట్ ను బ్రష్ తో తీసుకుని 3 నుండి 4 నిమిషాల పాటు దంతాలను శుభ్రం చేసుకోవాలి.ఇదిలావుండగా ఏదైనా కూల్ డ్రింక్ వంటి వాటిని తీసుకునేటప్పుడు స్ట్రా తో తాగడం మంచిది వలన దంతాల మీద ఎనామిల్ పొర ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది దంతాలు పసుపు రంగులోకి మారిపోకుండా ఉండాలంటే రోజు బ్రష్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: