మొబైల్ ని బాత్రూంలో యూజ్ చేస్తున్నారా.. ఆ వ్యాధి బారిన పడ్డట్టే..?

Divya
మొబైల్ లేకుండా మనిషి మనుగడ నడవడం చాలా కష్టంగా మారుతున్నది. ప్రతి ఒక్క విషయం పై కూడా ఎక్కువమంది మొబైల్ మీదే ఆధారపడి ఉన్నారు. అందుకే మనిషి జీవితంలో స్మార్ట్ మొబైల్ అనేది కూడా ఒక భాగం అయింది. మనం ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా మొబైల్ ఉండాల్సిందే.. భోజనం చేస్తున్నా ,నిద్రిస్తున్నా కచ్చితంగా మొబైల్ ఉపయోగించే తీరుతూ ఉంటాము. మరి కొంతమంది ఎక్కువగా బాత్రూం కి వెళ్ళినా కూడా తీసుకొని వెళుతూ ఉంటారు. అయితే ఇలా తీసుకు వెళ్లడం కూడా చాలా ప్రమాదం అని నిపుణులు తెలియజేస్తున్నారు వాటి గురించి చూద్దాం.

చాలామంది మొబైల్ ని టాయిలెట్ సీట్ పై కూర్చుని మరీ ఉపయోగిస్తూ ఉంటారు.. అయితే ఇలా ఉపయోగించడం వల్ల మొబైల్ లో బ్యాక్టీరియా వైరస్ గా మారి.. అది కడుపులోకి వెళ్లి సమస్యలను సైతం సృష్టించి ప్రాణాంతకమైన వ్యాధులను గురయ్యేలా చేస్తుందట. ముఖ్యంగా బాత్రూంలో హ్యాండిల్ ఫ్లష్ బటన్లను ఉపయోగిస్తూ ఉంటాము. ఆ తర్వాత మళ్లీ మొబైల్ ని ఉపయోగించడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వ్యాప్తి చెందుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

టాయిలెట్ సీట్ కంటే ఎక్కువగా మొబైల్ లోనే సూక్ష్మ క్రిములు ఉంటాయట. అందుకే గాలిలో బ్యాక్టీరియా వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.

బాత్రూంలో మొబైల్ ని ఎక్కువ సేపు ఉపయోగిస్తూ ఉండడం వల్ల.. క్రమక్రమంగా ప్రేగు కదలికలు వల్ల మలబద్ధక సమస్యగా మారుతుంది. దీనివల్ల పొత్తికడుపు లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయట.

అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఫైల్స్ ద్వారా కూడా ఇబ్బందులు తలెత్తేలా చేస్తాయి. వైద్యులు తెలుపుతున్న ప్రకారం టాయిలెట్ సీట్ పై  ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల మల సిర పైన ఎక్కువగా ఒత్తిడి ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: