ప్రకృతిలో దొరికే ఈ ఆకు వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కను పెద్ద పావిలి, పుల్లపాయల వంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. కొంతమంది వీటిని పప్పు కూరలలో వేసుకోని తినడం వల్ల పప్పుకి రుచి కలుగుతుంది. ఈ గంగ పాయల ఆకులు ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి. కనుక ఇందులో ఉండే ఐరన్ ,పొటాషియం, క్యాల్షియం వంటివి శరీరానికి చాలా ఉపయోగపడతాయి. వీటిని ఏ రూపంలో తిన్నా సరే మన శరీరంలో రక్తం శాతం పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే గంగపాయల కూర లో ఉండేటువంటి విటమిన్స్ వల్ల కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఎముకలు దృఢంగా తయారవ్వడానికి దంతాలు బలంగా తయారవ్వడానికి ఈ ఆకులు చాలా ఉపయోగపడతాయి. ఈ ఆకుకూరలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల వ్యాధులను కూడా దూరం చేస్తుందట. గంగ పాయల ఆకులు ఎక్కువగా ఒమేగా-3 ఉండడంవల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును సైతం తగ్గించి గుండెకు రక్షణ కలిగించేలా చేస్తుంది. ఈ ఆకుల నుంచి తీసిన రసం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.. ఈ రసం వల్ల ఏదైనా గాయాలు అయినా ఈ రసం పిండితే రక్తం రావడం ఆగిపోతుంది. నోటిలోని దంతాలు పుచ్చు పట్టిన ఈ ఆకు రసం ద్వారా బయటికి రప్పించవచ్చట.