ఒక ఫ్రెంచ్ ప్రై.. 25 సిగరెట్లతో సమానమా.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
అయితే ఇది మనిషి బరువు పెరగడంతో పాటు.. ఏకంగా క్యాన్సర్ కారకంగా కూడా మారుతుందని ఇటీవల పరిశోధకులు షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ అధికంగా తినడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో ఎక్కువగా పేరుకు పోతాయని చెబుతున్నారు. కేవలం ఒక్క సర్వింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల 25 సిగరెట్లు తాగినంత క్యాన్సర్ కారక ప్రభావం ఉంటుంది అంటూ ఇటీవల డాక్టర్లు వెల్లడించారు. నూనెను అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినప్పుడు ఈ కొవ్వులు ఏర్పడతాయట. నూనెలను వంటల్లో చాలాసార్లు తిరిగి ఉపయోగించినప్పుడు వాటి స్థాయిలు గణనీయంగా పెరుగుతాయట.
ఫ్రెంచ్ ఫ్రైస్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం వల్ల ధమనులు మూసుకోవడం జరుగుతుందని.. ఇలాంటి వాటి వల్ల గుండెపోటు స్ట్రోక్స్ ప్రమాదం జరుగుతుందని చెబుతున్నారు. ది జర్నల్ ఆఫ్ లిక్విడ్ రీసెర్చ్ లో ప్రచురించబడిన ఒక అధ్యయన ప్రకారం.. వేయించేటప్పుడు ఉత్పత్తి అయ్యే హాల్డే హైడ్లు డిఎన్ఏ దెబ్బతినేలా చేస్తాయని క్యాన్సర్ కణాల పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి అంటూ పరిశోధకులు తెలిపారు. గురుగ్రమ్ లోని మారిండో ఆసియా హాస్పిటల్లో కార్డియాలజీ అసోసియేటెడ్ డైరెక్టర్ యోగేంద్ర సింగ్ సిగరెట్ తాగడం కంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం చాలా హానికరం అంటూ చెప్పుకొచ్చారు. గుండె జబ్బులు ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు శ్వాసకోశ సమస్యలకు ఇదే దారితీస్తుందని చెప్పుకొచ్చాడు.