మీ హైట్ కి తగ్గ బరువు ఉన్నారా.. ఎవరు ఎంత బరువు ఉండాలంటే?
కనీసం ప్రతిరోజు వ్యాయామం చేయడానికి కూడా సమయం లేకపోవడంతో.. ఇక ఎంతోమంది బరువు పెరిగిపోతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా బరువు పెరిగినవారు.. ఏ పని చేయడానికి అయినా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో చాలా మందిలో బరువు పెరగడం విషయంపై అనుమానాలు ఉంటాయి. ఎంత హైట్ ఉంటే ఎంత ఏజ్ ఉంటే ఎంత బరువు ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే హైట్ కి వయస్సుకి తగ్గట్లుగా బరువు లేకపోతే.. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు.
అయితే ఎంత హైట్ ఉంటే ఎంత బరువు ఉంటారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
4 అడుగుల 10 అంగుళాలు వారు 41 నుండి 52 కిలోలు, 5 అడుగుల ఎత్తు ఉన్నవాళ్లు 44 నుండి 55.7 కిలోలు, 5 అడుగుల 2 అంగుళాలు ఉన్నట్టయితే 49 నుండి 63, 5 అడుగుల 4 అంగుళాలుకైతే 49 నుండి 63 కిలోలు, 5 అడుగుల 6 అంగుళాలు వారు 53 నుండి 67 కిలోలు, 5 అడుగుల 8 అంగుళాలు ఉన్నట్టయితే 56 నుండి 71 కిలోలు, 5 అడుగుల 10 అంగుళాలు ఉంటే 59 నుండి 75 కిలోలు ఉండాలి అని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.