వాటర్ హీటర్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్తా?

praveen
నేటి రోజుల్లో మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన వస్తువుల వాడకం మరింత పెరిగిపోయింది. అలాంటి వస్తువులను వాడుతూ ప్రతి పని కూడా సులభతరం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్స్ కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కూడా కారణమవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే  అయితే ఒకప్పుడు స్నానానికి నీళ్లు వేడి పెట్టుకోవాలి అంటే కట్టెల పొయ్యి మీద వేడి పెట్టుకునేవారు. కానీ నేటి రోజుల్లో హీటర్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.

 కాస్త డబ్బున్న వారు అయితే హీటర్లతో పని లేకుండా ఏకంగా బాత్రూంలోనే గీజర్లను పెట్టుకుంటున్నారు. ఇంకొంతమంది గీజర్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నవారు ఇక హీటర్లను పెట్టుకోవడం చూస్తూ ఉన్నాము అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి హీటర్లు వాడటం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే చివరికి ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. నిజాంబాద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హీటర్ తో నీళ్లు వేడి పెట్టుకున్నాడు. అయితే నీళ్లు వేడెక్కాయో లేదో అని చూసేందుకు హీటర్ ఆన్ లో ఉండగానే బకెట్లో చేయి పెట్టాడు.

 దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కి గురై చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ ఘటనతో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఇలాంటి తరహా ఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. అందుకే హీటర్ వాడుతున్న సమయంలో ఇక జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు హీటర్ను స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ నుంచి తీసేసిన తర్వాతే ఇక నీటిని ముట్టుకోవాలి అంటూ చెబుతున్నారు. అలాగే ఇనుము లేదా స్టీల్ బకెట్లను కాకుండా కేవలం ప్లాస్టిక్ బకెట్లను మాత్రమే ఇలా హీటర్ తో నీళ్లు కాచుకోవడానికి ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బకెట్లు కరగకుండా ఒక చెక్క ముక్కను ఉపయోగించాలి అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: