చిన్నపిల్లలు డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుంది..?
డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువగా విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది.. అందుకే డ్రాగన్ ఫ్రూట్ ని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని వెంటనే పెంచుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.. ఇవి చిన్నపిల్లలలో ఫ్రీ రాడికల్స్ సైతం హానికరమైన వాటిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
డ్రాగన్ ఫ్రూట్ చిన్నపిల్లలు తినడం వల్ల పిల్లలకు వచ్చే చర్మం అలర్జీలను కూడా తగ్గించవచ్చు.అలాగే చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుందట.
డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల.. పిల్లలను గట్ బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ అవ్వడానికి కూడా సహాయపడుతుంది. చిన్నపిల్లలలో మలబద్ధక సమస్య రాకుండా చేస్తుందట.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది చాలా దృఢంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెంచడానికి ఇందులో కావలసిన విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లలని త్వరగా ఎలాంటి రోగాల బారిన పడకుండా చేస్తుంది. గతంలో వీటి ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో చాలా చౌకగానే లభిస్తూ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ఈమధ్య అన్ని కాలలో కూడా లభిస్తున్నది. అందుకే ఈ పండుని పిల్లలనుంచి పెద్దల వరకు తినడం మంచిది.