మానవ శరీరంలో రెండో గుండె.. ఈ విషయం మీకు తెలుసా?
అంతేకాకుండా మనిషి శరీరం గురించి తమకు పూర్తిగా తెలుసు అన్న విధంగానే నేటి రోజుల్లో జనాల ఆలోచన తీరు కూడా మారిపోయింది. ఇలాంటి సమయంలో కొన్ని కొన్ని సార్లు మనిషి శరీరం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి విషయమే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ప్రతి మనిషి శరీరంలో రెండు చెవులు రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయి అన్న విషయం తెలుసు. కానీ మనిషి శరీరంలో రెండు గుండెలు కూడా ఉంటాయి అనే విషయం తెలుసా.
రెండు గుండెలు ఉండడం ఏంటి వినడానికి కాస్త విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. అయితే మోకాలు కింద ఉండే బాగాన్ని రెండో గుండె గా పరిగణిస్తారని విషయం చాలామందికి తెలియదు. ధమనులు గుండె నుంచి రక్తాన్ని శరీరమంతా పంపిణీ చేస్తాయి. సిరలు పైకి తీసుకువస్తాయి. ఇక ఈ ప్రక్రియ గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా జరుగుతుండడంతో కాలి కండరం పంపిణీలో ఎంతగానో సహాయపడుతుంది. అడుగు వేసినప్పుడల్లా రక్తం పంప్ అవుతుంది. కాబట్టి నడక ఎంతో అవసరం. ఒకవేళ ఎక్కువ సేపు కూర్చుంటే పాదాన్ని వెనక్కి ముందుకు కదిలించాలి అని నిపుణులు చెబుతున్నారు.