ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్.. భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఆగస్టు 14న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసిస్ ప్రజలు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైందని షాకింగ్ కామెంట్లు చేశారు. 2024లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 15,664 మందికి ఈ వ్యాధి సోకింది. అంతేకాదు ఇది 548 మంది ప్రజలను పొట్టన పెట్టుకుంది. బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్), కెన్యా, రువాండాతో సహా ఇతర ఆఫ్రికన్ దేశాల్లో కూడా మంకీపాక్స్ కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి.
ఆఫ్రికా దేశానికి మాత్రమే ఈ డిసీస్ పరిమితం కాలేదు ఆగస్టు 15వ తేదీన స్వీడన్‌లో ఫస్ట్ మంకీపాక్స్ కేసు నమోదైంది. దాంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. స్వీడన్‌లో ఈ వ్యాధి సోకిన వ్యక్తిని పరిశీలించగా అది డెడ్లీ క్లేడ్ Iబి వేరియంట్ అని తేలింది. మన పక్క దేశమైన పాక్‌లో 3 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీళ్లు యూఏఈ నుంచి వచ్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ వ్యాధి వీరికి ఎక్కడ సోకిందో తెలియ రాలేదు.
ఎంపాక్స్ సోకిన ప్రజల వద్దకు వెళ్ళకూడదు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది. మళ్లీ అది తగ్గడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. రోగుల ఒంటి మీద దద్దుర్లు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, మనిషి బలహీనపడడంలాంటి సింటమ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ఎంపాక్స్ రోగిని ప్రత్యక్షంగా తాకకూడదు. నోటిలో లేదా జననేంద్రియాలపై ఉన్న చర్మగాయాల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ వ్యాధి వచ్చిన వారిని మౌత్ కిస్ చేసినా లేదా వజైనల్, ఆనల్ సెక్స్, ఓరల్ సెక్స్, స్కిన్ కిస్సింగ్ చేసినా సరే ఇది వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జంతువులు కొరికినా వాటి నుంచి ఈ వ్యాధి వస్తుంది.
ఎంపాక్స్ వ్యాధి రాకుండా ఉండేందుకు ఎంబీఏ-బీఎన్, ఎల్‌సీ16, ఆర్థోపాక్స్‌వ్యాక్స్ వంటి మూడు వ్యాక్సిన్ లలో ఏదో ఒకటి వేయించుకోవచ్చు. ఎంపాక్స్ వ్యాక్సిన్ తీసుకుంటే దీని బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఎంపాక్స్ రోగులతో పొరపాటున కాంట్రాక్టు అయి ఉంటే 4 రోజులలోపు టీకా తీసుకుంటే దాని బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది