పరగడుపున బొప్పాయి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Purushottham Vinay

వాస్తవానికి పండ్లను ఉదయాన్నే పరగడుపున తినకూడదు అని చాలా మంది అంటుంటారు. కానీ.. బొప్పాయి పండు మాత్రం అలా కాదట. హ్యాపీగా.. ఉదయాన్నే ఒక కప్పుడు బొప్పాయి ముక్కలను అయినా తినేయవచ్చట. బొప్పాయి పండు అంటే ఇష్టపడనివారు చాలా తక్కువగా ఉంటారు. ఈ పండు తినడం వల్ల.. మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయట. అయితే.. సహజంగా ఈ పండును ఎవరైనా బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేదంటే...సాయంత్రం వేళలో స్నాక్ రూపంలో ఒక కప్పు తీసుకుంటారు.కానీ.. బొప్పాయి పండును ఉదయం బ్రేక్ ఫాస్ట్ రూపంలో ఎప్పుడైనా తీసుకున్నారా..? అలా బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీస్కోవడం వల్ల మనకు లాభమా నష్టమా..? అసలు బొప్పాయి పండు పరగడుపున తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి మరి .బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా, అద్భుతంగా ఉంటుంది. అయితే.. రుచి మాత్రమే కాదు పోషకాల గని కూడా . ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఈ బొప్పాయిలో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కళంగా ఉంటాయి. అంతేకాకుండా.. ఇందులో లుటిన్ వంటి అంశాలు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి.


ఇన్ని విటమిన్స్, మినరల్స్ ఉన్న బొప్పాయిని.. పరగడుపున తినడం వల్ల.. దాని ప్రయోజనాలు రెట్టింపు అవ్వడమే కాకుండా శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఎవరైనా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నట్లయితే... ఆ సమస్య నుంచి చాలా ఈజీగా బయట పడొచ్చు. ఖాళీ కడుపుతో తినడం వల్ల.. జీర్ణ వ్యవస్థ అనేది  చాలా బలంగా మారుతుంది. అలాగే బొప్పాయిలో పీచు  పదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని తిన్న తర్వాత మలబద్ధకం సమస్యను దూరం చేయడమే కాకుండా పొట్టలో ఎలాంటి ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంచుతుంది. అలాగే, ఈ పండు ఎసిడిటీ , అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.మీరు బరువు ఎక్కువగా ఉన్న తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినండి. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగానూ, ఫైబర్ అధికంగానూ ఉంటుంది. బొప్పాయి తింటే చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. ఇది మీరు అతిగా తినకుండా నిరోధిస్తుంది. అలాగే, మీరు మీ బరువును సులభంగా, వేగంగా తగ్గించుకోవచ్చు.బొప్పాయిలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ పండును తింటే, ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు , ఇన్ఫెక్షన్ల నుండి ఇన్ఫ్లమ్మషన్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.మీ శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నట్లయితే ఇంకా మీకు మధుమేహం లేదా గుండె జబ్బులు వంటి ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం చాలా మంచిది. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ పండులో పొటాషియం, ఫైబర్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు సమస్య ఉన్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి.. ప్రతిరోజూ బొప్పాయి పండును మీ డైట్ లో చేర్చుకొని ఈ ప్రయోజాలన్నీ పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: