పంటి నొప్పితో ఇబ్బంది పడేవారు ఇలా నొప్పి తగ్గించుకోవచ్చు?
ఇదివరకటి రోజుల్లో కేవలం వయసు మీద పడిన వారికి, వృద్ధాప్య వయసులో ఉండే వారికి మాత్రమే పంటి నొప్పి సమస్యలు ఉండేవి . కానీ రాను రాను కాలం మారిపోవడంతో ఈ పంటి నొప్పి సమస్యలు పెద్దలకే కాదు చిన్న పిల్లల నుంచే మొదలవుతున్నాయి.అయితే ఈ పంటి నొప్పికి ఎన్నో రకాలు అయినా కారణాలు ఉన్నాయి. తీపి ఎక్కువగా తినడం వల్ల , బ్రష్ సరిగ్గా చేయకపోవడం వల్ల , పన్ను పుచ్చిపోవడం ఇలా అనేక రకాల కారణాల వల్ల కూడా పంటి నొప్పి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ పంటి నొప్పి తీవ్రం అయినప్పుడు కనీసం నీరు తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు..ఈ పంటి నొప్పిని తగ్గించుకోవడానికి వెంటనే డెంటిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లి పన్ను క్లీన్ చేయించుకోవడం, లేదంటే పళ్ళు పీకించుకోవడం, సిమెంట్ పెట్టించుకోవడం లాంటివి కూడా చేస్తుంటారు. కానీ ఇక మీదట అలా చేయాల్సిన పనిలేదు అంటున్నారు వైద్యులు.. ఎందుకంటే ఇంట్లోనే దొరికే సాధారణ మైన వాటితోనే చక్కటి రెమిడీలు ఫాలో అయితే ఈ పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు.. ఇంతకీ ఆ రెమెడీలు ఏంటో చూద్దామా..లవంగం నూనె లవంగాలు ఎంతో బాగా పంటి నొప్పికి ఉపయోగపడతాయి. చాలా రకాల టూత్ పేస్టులలో లవంగాలను ఉపయోగిస్తూ ఉంటారు. దంతాలను సంరక్షంగా,ఆరోగ్యంగా ఉంచడంలో లవంగాలు ఎంతో బాగా సహాయపడతాయి .
లవంగం నూనెలోని యూజినాల్ అనే పదార్ధం, ఇది ప్రభావిత ప్రాంతాలను ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే అందుకోసం ముందుగా లవంగాలను చూర్ణం చేసుకోవాలి. ఆ తర్వాత లవంగాల పొడిని ఒక చిన్న జాడిలో ఉంచాలి. తర్వాత అందులో తగినంత ఆలీవ్ నూనె కూడా కలపాలి. ఆ తర్వాత ఆ జాడీని మూసి ఆ మిశ్రమాన్ని చీకటి ప్రదేశంలో ఒక వారం లేదా రెండు వారాలపాటు అలాగే ఉంచాలి. అప్పుడప్పుడు మీరు ఆ జాడీని షేక్ చేయవచ్చు. ఒక వారం లేదా రెండు వారాల తర్వాత, నూనె నుండి చిన్న ముక్కలుగా తరిగిన లవంగాలను వడకట్టి, లవంగం నూనెను ప్రత్యేక కూజాకు బదిలీ చేయాలి.అయితే లవంగం నూనెను చీకటి కూజాలో నిల్వ ఉంచాలని గుర్తుంచుకోవాలి. తర్వాత ఆ నూనెను చిన్న కాటన్ బాల్ పై వేసి నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఇలా తరచూ చేయడం వల్ల పంటి నొప్పి నుండి తొందరగా బయట పడొచ్చు . పంటినొప్పిని సులభంగా తగ్గించినప్పటికీ దీని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రమాదకారం. చర్మం కాలిపోతుంది. గర్భిణీ స్త్రీలు, పిల్లలు దీనిని జాగ్రత్తగా ఉపయోగించాలి.