జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే?

praveen
ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మరి ముఖ్యంగా వైద్య రంగంలో అధునాతన టెక్నాలజీ ఎన్నో అనూహ్యమైన మార్పులకు కారణమైంది అని చెప్పాలి. అయితే నేటి టెక్నాలజీ యుగంలో ఎవరు ఏ సమస్య వచ్చినా మునుపటిలా భయపడి ఆసుపత్రికి పరుగులు పెట్టడం లేదు. ఇక వైద్యంపై ఇక ఏదైనా ఆరోగ్య సమస్య వస్తేవాడే మందులపై ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చిన నేపథ్యంలో.. ఇక చిన్న అనారోగ్య సమస్యలకి సొంత వైద్యం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా చాలామంది జ్వరం వచ్చినప్పుడు ఇంట్లోనే టాబ్లెట్ వేసుకొని జ్వరాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం.

 అయితే జ్వరం వస్తే ఎలాంటి టాబ్లెట్ వేసుకోవాలి ఒకవేళ జలుబు వస్తే ఎలాంటి సిరప్ తాగాలి అన్న విషయం అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. కానీ జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి అనే విషయంపై మాత్రం కొంతమంది కొన్ని విషయాలపై ఇప్పటికి అనుమానాలు పడుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు అనే విషయంపై ప్రతి ఒక్కరిలో కొన్ని అనుమానాలు ఉంటాయి అని చెప్పాలి   అయితే చాలామంది జ్వరం వచ్చినప్పుడు నాన్వెజ్ తినాలా వద్దా అనే విషయంపై చాలా సందేహాలను పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే ఇక ఫీవర్ మరింత ఎక్కువ అవుతుందని అనుకుంటూ ఉంటారు.

 ఇలా జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినాలా వద్దా అని చాలామంది సందేహ పడుతూ ఉంటారు. అయితే ఆయిల్ మసాలాలు తక్కువ వేసి వండిన చికెన్ తినొచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. గ్రిల్డ్ చికెన్, బిర్యాని, ఫ్రై చికెన్ తింటే కడుపు మంటగా ఉంటుందని చెబుతున్నారు. ఇక త్వరగా జీర్ణం కూడా కాదు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే వాటి జోలికి అస్సలు వెళ్లొద్ధు అంటూ హెచ్చరిస్తున్నారు. చికెన్ లో ప్రోటీన్లు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయని.. అందుకే చికెన్ కేవలం వండుకొని తినడం మాత్రమే కాదు సూప్ గా తాగినా కూడా ఎంతో మంచిది అంటూ వైద్యులు సూచిస్తూ ఉండడం గమనర్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: