నిమ్మకాయ నీరు మనిషి కి ఎంతో మేలు చేస్తుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే . కానీ మనకు తెలిసినవి కొన్ని ప్రయోజనాలు మాత్రమే . మనకు తెలియ కుండా నిమ్మకాయలో మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి . నిమ్మ కాయను కనుక సరిగ్గా వాడుకున్నట్లు అయితే అది చేసే ప్రయోజనాలు అన్ని , ఇన్ని కావు . ఇక పోతే కొంత మంది చాలా బరువుగా ఉన్నాము అని ఫీల్ అవుతూ ఉంటారు . అలాంటి వారు ఏవేవో ప్రక్రియలను చేస్తూ బరువు తగ్గించుకోవడాని కి అనేక ప్రయాసలు పడుతూ ఉంటారు.
మరి కొంత మంది శరీరానికి చెడు చేస్తాయి అని తెలిసిన కొన్ని టాబ్లెట్స్ ను కూడా వాడుతూ బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నిమ్మకాయ రసం వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు అనే విషయం చాలా మంది కి తెలియదు. ఇక నిమ్మకాయ నీటిని తాగడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. కాకపోతే అది ఎప్పుడు పడితే అప్పుడు తాగడం వల్ల కాదు. దానికి అంటూ ఒక ప్రత్యేక సమయం ఉంది.
ఆ సమయంలో మాత్రమే నిమ్మకాయ నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు అది ఏ సమయం అనే విషయం తెలుసుకుందాం. నిమ్మ కాయ నీరు రోజు పరిగడుపున తాగినట్లు అయితే బరువు చాలా వరకు తగ్గవచ్చు. అలాగే నిమ్మ కాయ నీరును రోజు పరగడుపున తాగి బరువును తగ్గించుకోవాలి అనుకునేవారు కాఫీ , టీ లు ఉదయం తాగడం మాని వేయాలి. ఇలా చేసినట్లు అయితే బరువును తగ్గించుకోవచ్చు. ఇలా నిమ్మకాయ నీరు రోజు పరిగడుపున తాగడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. ఇలా నిమ్మ కాయ రసం బరువు ఎక్కువ ఉండి తగ్గాలి అనుకునే వారికి కూడా ఎంత గానో ఉపయోగపడుతుంది.