ఈ లక్షణాలుంటే మౌత్ క్యాన్సర్ కన్ఫామ్?

Purushottham Vinay
నోటి క్యాన్సర్ అనేది వచ్చిందంటే ఖచ్చితంగా నరకం కనపడుతుంది. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు. ఈ క్యాన్సర్ ఖచ్చితంగా ఉన్నవారికి ఏం తినాలన్నా, తాగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. నోటి క్యాన్సర్ మాత్రమే కాకుండా ఏ క్యాన్సర్ వచ్చినా కూడా ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గిపోతారు. ఇలా జరిగిందేమో చూడండి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గి సీజనల్ వ్యాధులు పదే పదే వస్తుంటాయి. ఇలా జరుగుతున్నా కూడా క్యాన్సర్‌గా అనుమానించాలి. అయితే ఇది రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అందుకు గాను తంబాకు నమలడం లేదా పొగ తాగడం మానేయాల్సి ఉంటుంది. నోటి క్యాన్సర్ వచ్చేందుకు ఇవే రెండు పెద్ద కారణాలు. కనుక ఈ అలవాట్లను వెంటనే మానేయాలి. లేదంటే ప్రాణాంతకం అవుతుంది. అలాగే మద్యం సేవించడం కూడా నోటి క్యాన్సర్ వచ్చేందుకు కారణం అవుతుంది. కనుక దీన్ని కూడా మానేయాల్సి ఉంటుంది.


నోట్లో పూతలు లేదా పొక్కుల వంటి గుల్లలు 2 వారాలకు మించి అలాగే ఉంటే వాటిని నోటి క్యాన్సర్‌గా గుర్తించాలి.ఇంకా అలాగే నోట్లో నాలుక లేదా నోరు కింది భాగంలో స్పర్శ లేనట్లు ఉంటుంది.అలాగే కొన్ని సార్లు సూదులతో గుచ్చినట్లు కూడా ఉంటుంది. నోట్లో లేదా నాలుకపై ఎరుపు రంగులో మచ్చలు ఏర్పడుతుంటే అవి నోటి క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నోట్లో లేదా గొంతులో, నాలుక కింద, బుగ్గల లోపలి వైపు కణతులు ఏర్పడి నొప్పిగా ఉంటున్నా కూడా వాటిని నోటి క్యాన్సర్‌గా అనుమానించాలి.నిజానికి ఈ నోటి క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి అని చెప్పవచ్చు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందు స్టేజ్‌లోనే గుర్తించవచ్చు. దీంతో విజయవంతంగా మనం చికిత్స కూడా తీసుకోవచ్చు.  నోటి క్యాన్సర్ వచ్చిన కొత్తలో మన శరీరం పై విధంగా పలు లక్షణాలను, సంకేతాలను ఇస్తుంది. ఇక వాటిని ముందుగానే గుర్తించడం ద్వారా డాక్టర్ ను కలసి పరీక్షలు చేయించుకుని, క్యాన్సర్ అని తేలితే త్వరగా చికిత్స తీసుకోవచ్చు. దీంతో ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: