మధుమేహులు వీటిని అధికంగా తింటే ప్రమాదమే?

Purushottham Vinay
మధుమేహం సమస్య ఉన్నవారు ఖచ్చితంగా తాము తీసుకునే డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. రోజంతా వారు ఏం తిన్నా సరే ఖచ్చితంగా షుగర్ లెవల్స్ అనేవి మాత్రం పెరగకుండా చూసుకోవాలి.లేదంటే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు వస్తాయి. కొన్ని రకాల ఆహారాల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కొన్నింటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇక కొన్ని ఫుడ్స్ విషయానికి వస్తే వాటిల్లో కొవ్వులు అధికంగా ఉంటాయి. అయితే వీటిల్లో ఏవి తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయో డయాబెటిస్ పేషెంట్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలిసిన అవసరం ఉంది. లేదంటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోయి ఖచ్చితంగా చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది.చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల రసాలు, జ్యూస్‌లు, మిల్క్ షేక్‌లు, శీతల పానీయాలకు షుగర్ పేషెంట్లు ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలి. వీటి అద్భుతంగా ఉంటాయి.


కానీ షుగర్ లెవల్స్‌ను మాత్రం ఒక రేంజ్ లో పెంచుతాయి. అందుకే ఇవి డయాబెటిస్ పేషెంట్లకు ఏమాత్రం మంచిది కాదు. అందుకే వారు ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇక వేసవి సీజన్‌లో మనం చాలా ఎక్కువగా తినే పండ్లలో మామిడి పండు  ఒకటి. దీనిలో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఉంటుంది. మామిడి పండ్లలో గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. కాబట్టి ఈ పండ్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే చాన్స్ ఉంటుంది. అయితే తక్కువ మోతాదులో మామిడి పండ్లను షుగర్ పేషెంట్లు తినవచ్చు. కానీ ఎక్కువగా తింటే మాత్రం షుగర్ లెవల్స్ ఒక రేంజ్ లో పెరుగుతాయి. అందుకే మామిడి పండ్లను తినే విషయంలో  జాగ్రత్త వహించాలి.అలాగే తేనె చక్కెర కాదు కాబట్టి దాన్ని షుగర్ పేషెంట్లు తినవచ్చని భావిస్తారు. అయితే అందులో కూడా మామిడి పండ్లలో మాదిరిగా ఫ్రక్టోజ్ ఉంటుంది. అందువల్ల తేనెను కూడా కేవలం మోతాదులో తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే మాత్రం షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: